Hair Care: వర్షాకాలంలో జుట్టు విపరీతంగా రాలిపోతుందా? ఇలా చేస్తే నిగనిగలాడే కురులు మీసొంతం
వర్షాకాలంలో బయటికి వెళ్లిన ప్రతి సారి మనతోపాటు గొడుగు తీసుకెళ్లలేం. ఫలితంగా ఒక్కోసారి వర్షంలో తడవాల్సి వస్తుంది. కానీ ఏమవుతుంది.. చాలా సమస్యలు వస్తాయి. ప్రధాన సమస్యలలో ఒకటి జుట్టు రాలడం. వర్షాలంలో జుట్టు రాలే సమస్య మరింత రెట్టింపు అవుతుంది. అందువల్ల వర్షాకాలంలో జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు..
Updated on: Aug 04, 2024 | 8:50 PM

వర్షాకాలంలో బయటికి వెళ్లిన ప్రతి సారి మనతోపాటు గొడుగు తీసుకెళ్లలేం. ఫలితంగా ఒక్కోసారి వర్షంలో తడవాల్సి వస్తుంది. కానీ ఏమవుతుంది.. చాలా సమస్యలు వస్తాయి. ప్రధాన సమస్యలలో ఒకటి జుట్టు రాలడం. వర్షాలంలో జుట్టు రాలే సమస్య మరింత రెట్టింపు అవుతుంది. అందువల్ల వర్షాకాలంలో జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.

క్యారెట్లు తినాలి. క్యారెట్‌లో బీటా కెరోటిన్, విటమిన్ ఎ ఉన్నాయి. ఇవి జుట్టు కరుకుదనాన్ని తొలగిస్తుంది. ప్రతిరోజూ క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల నెరిసిన జుట్టు సమస్య దూరం చేస్తుంది. అలాగే తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చడంలో ఉసిరికి మించిన ప్రత్యామ్నయం లేదు. ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా జుట్టు పొడవుగా పెరుగుతుంది. మూలాలు బలంగా మారుతాయి.

ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. స్కాల్ప్ లోపల ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. అలాగే తలపై ఆక్సీకరణ ఒత్తిడి ప్రభావాలను నివారిస్తుంది. ఉసిరితో బహుళ స్కాల్ప్ సమస్యలు నియంత్రించడం సులువు. దీని జ్యూస్‌లో వివిధ యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. ఇది వివిధ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా స్కాల్ప్, వెంట్రుకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ స్కాల్ప్‌లో పోషకాహార లోపాన్ని భర్తీ చేస్తుంది. ఉసిరి ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.

అలాగే జుట్టును ఆరబెట్టడానికి డ్రైయర్‌ని ఉపయోగించడం మానుకోవాలి. బదులుగా మృదువైన టవల్ ఉపయోగించాలి. స్నానం చేసిన తర్వాత తప్పకుండా మంచి సీరమ్‌ను జుట్టుకు అప్లై చేయాలి. ఇది జుట్టును చెదరగొట్టదు. కరుకుదనం తక్కువగా ఉంటుంది. బయటికి వెళ్లినా, వర్షంలో తడవకుండా జాగ్రత్త పడాలి.

చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుపచ్చని కూరగాయలను ఎక్కువగా తినాలి. ఇందులో ఉండే ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సి శరీర అవసరాల అభివృద్ధికి తోడ్పడుతుంది. తద్వారా జుట్టుకు పోషణను అందిస్తుంది.




