Bellam Biscuits: చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమైన బెల్లం బిస్కెట్లు.. ఈజీగా చేసేయవచ్చు..

ఇప్పుడున్న కాలంలో ఏది బయట తినాలన్నా చాలా భయంగా ఉంటుంది. బయట తయారు చేసే ఆహార పదార్థాల్లో ఏం కలుపుతున్నారో.. ఎలా చేస్తున్నారో.. అని ఆలోచనలో పడుతున్నారు. అందులోనూ ఇంట్లో చిన్న పిల్లలకు పెట్టే ఆహారంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం కదా.. అందుకే పిల్లలకు పెట్టే ఆహారంలో అస్సలు కాంప్రమైజ్ కాకుండా కాస్త సమయం పట్టినా ఇంట్లోనే తయారు చేసుకోవడం మంచిది. పిల్లలకు బిస్కెట్లు అంటే ఇష్టంగా తింటూ ఉంటారు. ఇంట్లోనే మనం చాలా రకాల..

Bellam Biscuits: చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమైన బెల్లం బిస్కెట్లు.. ఈజీగా చేసేయవచ్చు..
Bellam Biscuits
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2024 | 9:26 PM

ఇప్పుడున్న కాలంలో ఏది బయట తినాలన్నా చాలా భయంగా ఉంటుంది. బయట తయారు చేసే ఆహార పదార్థాల్లో ఏం కలుపుతున్నారో.. ఎలా చేస్తున్నారో.. అని ఆలోచనలో పడుతున్నారు. అందులోనూ ఇంట్లో చిన్న పిల్లలకు పెట్టే ఆహారంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం కదా.. అందుకే పిల్లలకు పెట్టే ఆహారంలో అస్సలు కాంప్రమైజ్ కాకుండా కాస్త సమయం పట్టినా ఇంట్లోనే తయారు చేసుకోవడం మంచిది. పిల్లలకు బిస్కెట్లు అంటే ఇష్టంగా తింటూ ఉంటారు. ఇంట్లోనే మనం చాలా రకాల బిస్కెట్లు తయారు చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా రకాలు తెలుసుకున్నాం. ఇప్పుడు బెల్లం బిస్కెట్ల గురించి తెలుసుకుందాం. పంచదార పెట్టడం ఇష్టం లేని వాళ్లు ఈ బెల్లం బిస్కెట్లు చేసుకోవచ్చు. వీటిని షుగర్ పేషెంట్స్ కూడా తినవచ్చు. ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయి. మరి వీటిని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.

బెల్లం బిస్కెట్లకు కావాల్సిన పదార్థాలు:

బెల్లం, పాలు, గోధుమ పిండి, బటర్ లేదా నెయ్యి, బేకింగ్ పౌడర్, ఉప్పు.

బెల్లం బిస్కెట్లు తయారీ విధానం:

బెల్లం బిస్కెట్లు తయారు చేసేందుకు ముందుగా వెడల్పాటి బౌల్ తీసుకోండి. ఇందులో గోధుమ పిండి, బెల్లం పొడి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా బేకింగ్ సోడా వేసి అన్నీ కలిసేట్టు బాగా మిక్స్ చేయాలి. ఇందులో నెయ్యి లేదా బటర్ వేసి మళ్లీ బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కరిగాక పాలు వేసి మళ్లీ కలపాలి. పిండిని ఎంత బాగా మిక్స్ చేస్తే బిస్కెట్లు అంత రుచిగా వస్తాయి. ఈ పిండి పల్చగా కాకుండా చపాతీలు చేసుకునే ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీ ముద్దను తీసుకని మందంగా చేసుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చిన ఆకారంలో బిస్కెట్లను కట్ చేసుకోండి.

ఇవి కూడా చదవండి

వీటిని ఇప్పుడు ఓవెన్‌తో అయినా, ఓవెన్ లేకపోయినా బిస్కెట్లు చేసుకోవచ్చు. ఓవెన్‌లో 160 డిగ్రీల వద్ద హీట్ చేయాలి. ఓవెన్ లేకపోతే.. ఒక మందం అడుగు ఉన్న కడాయి లేదా కుక్కర్ తీసుకోండి. ఇందులో సగం దాకా ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పును వేడి చేయాలి. మధ్యలో ఒక స్టీల్ స్టాండ్ లేదా బౌల్ లాంటిది పెట్టాలి. ఇప్పుడు దీనిపై బిస్కెట్లు వేసిన ప్లేట్ పెట్టాలి. చిన్న మంట మీద ఓ 20 నిమిషాలు వదిలేస్తే బిస్కెట్లు సిద్ధం. ఇవి తియ్యగా ఉంటాయి కాబట్టి పిల్లలకు బాగా నచ్చుతాయి.

హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్