AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

French Fries: ఇంట్లోనే తక్కువ ఖర్చుతో మెక్‌డొనాల్డ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్.. ఎలాగంటే!

ఫ్రెండ్ ఫ్రైస్ అంటే పెద్దలే కాదు చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఫ్రెంచ్ ఫ్రైస్‌ని మనకు ఇష్టం ఉన్న రుచితో తయారు చేసుకోవచ్చు. స్పైసీ ఇష్ట పడేవారు స్పైసీ ఫ్రెంచ్ ఫ్రైస్ తినవచ్చు. చాలా మంది ఫ్రెంచ్ ఫ్రైస్ బయట రెస్టారెంట్లలో తింటూ ఉంటారు. అక్కడ రేటు ఎక్కువ.. ఇచ్చే క్వాంటిటీ చాలా తక్కువ. మెక్‌డొనాల్డ్స్ తయారు చేసే ఫ్రెంచ్ ఫ్రైస్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మనం ఆ స్టైల్‌లో కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఎంతో హెల్దీగా, రుచిగా..

French Fries: ఇంట్లోనే తక్కువ ఖర్చుతో మెక్‌డొనాల్డ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్.. ఎలాగంటే!
French Fries
Chinni Enni
|

Updated on: Aug 31, 2024 | 7:25 PM

Share

ఫ్రెండ్ ఫ్రైస్ అంటే పెద్దలే కాదు చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఫ్రెంచ్ ఫ్రైస్‌ని మనకు ఇష్టం ఉన్న రుచితో తయారు చేసుకోవచ్చు. స్పైసీ ఇష్ట పడేవారు స్పైసీ ఫ్రెంచ్ ఫ్రైస్ తినవచ్చు. చాలా మంది ఫ్రెంచ్ ఫ్రైస్ బయట రెస్టారెంట్లలో తింటూ ఉంటారు. అక్కడ రేటు ఎక్కువ.. ఇచ్చే క్వాంటిటీ చాలా తక్కువ. మెక్‌డొనాల్డ్స్ తయారు చేసే ఫ్రెంచ్ ఫ్రైస్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మనం ఆ స్టైల్‌లో కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఎంతో హెల్దీగా, రుచిగా చేసుకోవచ్చు. మరి మెక్‌డొనాల్డ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్‌ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి వీటిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

మెక్‌డొనాల్డ్స్‌ ఫ్రెంచ్ ఫ్రైస్‌కి కావాల్సిన పదార్థాలు:

బంగాళదుంపలు, వైట్ వెనిగర్, ఉప్పు, ఐస్ ముక్కలు, ఆయిల్, చిల్లీ ఫ్లేక్స్.

ఇవి కూడా చదవండి

మెక్‌డొనాల్డ్స్‌ ఫ్రెంచ్ ఫ్రైస్‌ తయారీ విధానం:

ముందుగా వీటిని తయారు చేయడానికి ఆలు గడ్డలకు తొక్క తీసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు రెండు, మూడు సార్లు శుభ్రంగా కడిగి.. ఉప్పు, వెనిగర్ వేసిన చల్లటి నీటిలో వేసి ఓ అరగంట సేపు అలానే ఉంచండి. ఇలా చేయడం వల్ల ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా వస్తాయి. రుచి కూడా పెరుగుతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి.. వేడి చేయండి. ఆయిల్ వేడెక్కాక వీటిని వేసి మీడియం మంటపై అన్ని వైపులా వేయించుకోండి.

బంగాళ దుంప ముక్కలు కొద్దిగా ఉండే ఒకటే సారి ఆయిల్‌లో వేసి వేయించుకోవచ్చు. లేదంటే బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా వేసి వేయిస్తూ ఉండండి. ఇలా చేస్తే క్రిస్పీగా ఉంటాయి. చక్కగా ఉడుకుతాయి. ఫ్రెంచ్ ఫ్రైస్‌ని ఆయిల్ నుంచి బయటకు తీయగానే చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు వేసి బాగా కలపండి. చిల్లీ ఫ్లేక్స్ అవసరం లేదు అనుకుంటే సాల్ట్ వేసి కలుపుకోవచ్చు. ఇంకా ఇందులో చాట్ మసాలా వేస్తే మరింత రుచిగా ఉంటాయి. అంతే ఎంతో రుచిగా ఉండే మెక్‌డొనాల్డ్స్‌ ఫ్రెంచ్ ఫ్రైస్‌ సిద్ధం.

Follow Us
తెలుగులో రాత్రికి రాత్రే సెన్సేషన్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
తెలుగులో రాత్రికి రాత్రే సెన్సేషన్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
సీఎం విజయ్ ప్రమాణ స్వీకారంలో సీఎస్‌కే స్టార్ పేసర్
సీఎం విజయ్ ప్రమాణ స్వీకారంలో సీఎస్‌కే స్టార్ పేసర్
తాకట్టు పెట్టుకున్న ఫోన్ తిరిగివ్వలేదని ఏం చేశాడంటే?
తాకట్టు పెట్టుకున్న ఫోన్ తిరిగివ్వలేదని ఏం చేశాడంటే?
మీరు వాడే నెయ్యి మంచిదా.. కల్తీదా..? ఇంట్లోనే సింపుల్‌గా ..
మీరు వాడే నెయ్యి మంచిదా.. కల్తీదా..? ఇంట్లోనే సింపుల్‌గా ..
వరి బియ్యాన్ని తలదన్నే మిల్లెట్ బియ్యం..
వరి బియ్యాన్ని తలదన్నే మిల్లెట్ బియ్యం..
షోరూమ్‌ vs మెకానిక్‌.. బైక్‌ సర్వీసింగ్‌ ఎక్కడ చేయించాలి?
షోరూమ్‌ vs మెకానిక్‌.. బైక్‌ సర్వీసింగ్‌ ఎక్కడ చేయించాలి?
మండపంలో ప్రియుడు.. సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియురాలు.. చివరకు
మండపంలో ప్రియుడు.. సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియురాలు.. చివరకు
వామ్మో.. ఆ వర్కవుట్స్ ఏందీ మేడమ్.. నెటిజన్స్ రియాక్షన్ చూశారా..
వామ్మో.. ఆ వర్కవుట్స్ ఏందీ మేడమ్.. నెటిజన్స్ రియాక్షన్ చూశారా..
చూసి ఇదేం మూవీ అన్నారు.. ఇప్పటికీ యూత్ పెద్ద ప్యాన్స్..
చూసి ఇదేం మూవీ అన్నారు.. ఇప్పటికీ యూత్ పెద్ద ప్యాన్స్..
మళ్లీ లాక్‌డౌన్ తప్పదా..? ప్రధాని మోదీ అలర్ట్ వెనుక ఆంతర్యం ఇదేనా
మళ్లీ లాక్‌డౌన్ తప్పదా..? ప్రధాని మోదీ అలర్ట్ వెనుక ఆంతర్యం ఇదేనా