Spicy Chicken fry: ఈ దివాళీకి స్పైసీగా చికెన్ ఫ్రై ఇలా చేయండి.. అదుర్స్ అంతే..

నాన్ వెజ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ చికెన్‌కి సపరేట్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. నాన్ వెజ్‌లో ఎక్కువగా తినేది చికెనే. చికెన్‌తో ఎన్నో వెరైటీ రెసిపీలు తయారు చేసుకోవచ్చు. మీ కోసం ఇప్పుడు డిఫరెంట్‌గా ఉండే చికెన్ ఫ్రై మీ ముందుకు తీసుకొచ్చాం.

Spicy Chicken fry: ఈ దివాళీకి స్పైసీగా చికెన్ ఫ్రై ఇలా చేయండి.. అదుర్స్ అంతే..
Spicy Chicken Fry
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 31, 2024 | 9:50 PM

దీపావళి పండుగకు చాలా మంది నాన్ వెజ్ వండుకుంటూ ఉంటారు. పండుగ సమయంలో సింపుల్‌గా త్వరగా అయ్యేలా ఉండే రెసిపీలు ఏంటా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి వాటిల్లో ఈ చికెన్ ఫ్రై కూడా ఒకటి. వైట్ రైస్, సాంబార్‌తో ఈ చికెన్ ఫ్రై నంచుకుని తింటే ఆహా అనిపిస్తుంది. చికెన్ ఫ్రైలో ఇప్పటి వరకూ చాలా రకాలు ఫ్రైలు తెలుసుకున్నాం. తాజాగా మీ కోసం కాస్త వెరైటీ స్టైల్‌లో ఈ స్పైసీ అండ్ క్రంచీ చికెన్ ఫ్రై చేసుకోండి. స్ట్రీట్ స్టైల్‌లో తిన్నట్టు అనిపిస్తుంది. మరి ఈ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు:

చికెన్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, స్టార్ పువ్వు, నువ్వులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, టమాటా ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్.

చికెన్ ఫ్రై తయారీ విధానం:

ముందుగా చికెన్‌ని శుభ్రంగా కడిగి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. చికెన్‌లో ఉండే నీరంతా పిండి తీసుకోండి. ఇందులో కొద్దిగా పెరుగు, బిర్యానీ ఆకులు, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. దీన్ని ఓ గంట లేదంటే అరగంట సేపు పక్కన పెట్టినా సరిపోతుంది. ఆ తర్వాత ఒక కడాయి తీసుకుని అందులో ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, స్టార్ పువ్వు, నువ్వులు, దాల్చిన చెక్క వేసి వేయించి.. చల్లారాక మిక్సీలో వేసి పొడి చేయాలి. ఇప్పుడు అదే పాన్‌లో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆ తర్వాత కరివేపాకు వేసి చిటపటలాడాక పచ్చి మిర్చి, ఉల్లి ముక్కలు వేసి వేయించండి.

ఇవి కూడా చదవండి

ఇవి బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవి కూడా బాగా మగ్గాక.. మ్యారినేట్ చేసిన చికెన్ వేసి చిన్న మంట మీద మూత పెట్టి.. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా చికెన్ ఉడకడానికి ఓ పావు గంట సేపు పడుతుంది. చికెన్ ఫ్రై అయ్యా మిక్సీ పట్టిన మసాలా పొడి, కొత్తిమీర, కరిపాకు కొద్దిగా వేసి బాగా కలపాలి. మరో ఐదు నిమిషాలు చిన్న మంట మీద ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై సిద్ధం. ఈ చికెన్ ఫ్రై బిర్యానీ, అన్నం, చపాతీలోకి కూడా టేస్టీగా ఉంటుంది.

కంటి కింద కొబ్బరి నూనెతో మసాజ్‌.. ఫలితం ఎలా ఉంటుందో తెలుసా !!
కంటి కింద కొబ్బరి నూనెతో మసాజ్‌.. ఫలితం ఎలా ఉంటుందో తెలుసా !!
అర్ధరాత్రి బైక్ పై వెళ్తుండ‌గా ఎదురొచ్చిన సింహం.. ఆ త‌ర్వాత ??
అర్ధరాత్రి బైక్ పై వెళ్తుండ‌గా ఎదురొచ్చిన సింహం.. ఆ త‌ర్వాత ??
ఘనంగా శ్రీ చిన్న జీయర్ స్వామి పుట్టినరోజు వేడుకలు.. వీడియో
ఘనంగా శ్రీ చిన్న జీయర్ స్వామి పుట్టినరోజు వేడుకలు.. వీడియో
దీపావళిలో వెండికి వెలుగులు.. కొనుగోళ్లలో సిల్వర్‌ రికార్డ్‌ల మోత!
దీపావళిలో వెండికి వెలుగులు.. కొనుగోళ్లలో సిల్వర్‌ రికార్డ్‌ల మోత!
కాలనీలో టపాసులు కాల్చొద్దని పొరుగింటి వారు చేసిన పని తెలిస్తే..
కాలనీలో టపాసులు కాల్చొద్దని పొరుగింటి వారు చేసిన పని తెలిస్తే..
ప్రతీ రోజూ ఈ ఆకు కూర తినండి.. ఫలితం మీరే చూడండి !!
ప్రతీ రోజూ ఈ ఆకు కూర తినండి.. ఫలితం మీరే చూడండి !!
రేణుదేశాయ్ రిక్వెస్ట్ తో ఉపాసన ఆర్థిక సాయం !!
రేణుదేశాయ్ రిక్వెస్ట్ తో ఉపాసన ఆర్థిక సాయం !!
కట్టెల కోసం వెళ్తే.. తల్లీబిడ్డలపై దాడి చేసిన కందిరీగలు.. చివరికి
కట్టెల కోసం వెళ్తే.. తల్లీబిడ్డలపై దాడి చేసిన కందిరీగలు.. చివరికి
ఇండియన్‌ సినిమా చరిత్రలోనే.. నయా రికార్డ్‌ !!
ఇండియన్‌ సినిమా చరిత్రలోనే.. నయా రికార్డ్‌ !!
రాత్రి భోజనం మానేస్తున్నారా ?? నిజంగా ధైర్యం ఉంటే ఆ పని చేయండి
రాత్రి భోజనం మానేస్తున్నారా ?? నిజంగా ధైర్యం ఉంటే ఆ పని చేయండి