రోజూ ఒక గ్లాస్‌ పాలకూర జ్యూస్‌ తాగితే..

Narender Vaitla

31 October 2024

పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు.

రక్తపోటు సమస్యతో బాధపడేవారికి కూడా పాలకూర జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో సహజంగా లభించే నైట్రేట్‌లు రక్తనాళాలను విస్తరించడంలో ఉపయోగడపతాయి. దీంతో బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.

గుండె సమస్యలను కూడా పాలకూర జ్యూస్‌ దూరం చేస్తుంది. రక్తప్రసరణ మెరుగై గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.

క్యాన్సర్‌ను తరిమికొట్టడంలో కూడా పాలకూర జ్యూస్‌ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులోని పోషకాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నాశనం చేస్తాయి.

పాలకూర జ్యూస్‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే కంటి సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ఇందులోని లుటిన్, జియాక్సంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్‌ కంటి సమస్యలను దూరం చేస్తాయి.

జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా పాలకూర జ్యూస్‌ ఉపయోగపడుతుంది. ఇందులోని డైటరీ ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

రోజూ ఒక గ్లాస్‌ పాలకూర జ్యూస్‌ తాగితే యాంటీ ఏజింగ్ డ్రింక్‌గా ఉపయోగపడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపరిచి, చర్మాన్ని లోపలి నుంచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.