పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు.. 

Narender Vaitla

31 October 2024

పుట్టగొడుగుల్లో విటమిడ్‌ డి, యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో సహాయపడుతాయి.

గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉండాలంటీ పుట్టగొడుగులను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

మష్రూమ్స్‌ను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. ఇందులోని ఔషధ గుణాలు క్యాన్సర్‌ కణాలను పెరగకుండా అడ్డుకుంటాయి.

బరువు తగ్గాలనుకునే వారు పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో తక్కువ కేలరీలు ఉండడమే దీనికి కారణంగా చెప్పొచ్చు.

ఫైబర్‌ కంటెంట్‌కు మష్రూమ్స్‌ పెట్టింది పేరు. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు ఏవైనా ఉంటే దూరమవుతాయి.

ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా పుట్టగొడుగులు ఉపయోగపడతాయి. ఇందులోని విటమిన్ డి2, విటిమిన్ డిలు ఎముకలు, కండరాలని బలంగా చేస్తాయి.

వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది. వీటిలో బయోయాక్టివ్ అణువులు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగై, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.