Nikesha Patel: బాబోయ్.. మెంటలెక్కిస్తోన్న పవన్ కళ్యాణ్ ‘పులి’ మూవీ హీరోయిన్.. ఇప్పుడు చూస్తే..
సినీరంగంలో ఒక్క సినిమాతోనే ఫుల్ ఫేమస్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుని ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. అందులో నికీషా పటేల్ ఒకరు. ఈ పేరు చెబితే అడియన్స్ అసలు గుర్తుపట్టలేరు. కానీ పవన్ కళ్యాణ్ నటించిన పులి సినిమా హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో కొమరం పులి ఒకటి. డైరెక్టర్ ఎస్జే సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. 2010లో విడుదలైన ఈసినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. మ్యూజిక్ పరంగా సూపర్ హిట్ అయిన ఈమూవీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించారు పవన్ కళ్యాణ్. అయితే ఈ చిత్రంలో కథానాయికగా నటించి ఫుల్ ఫేమస్ అయ్యింది హీరోయిన్ నికీషా పటేల్. తొలి చిత్రంతోనే వెండితెరపై మాయ చేసింది. తన గ్లామర్ లుక్స్ లో పులి చిత్రంలో మెస్మరైజ్ చేసింది నికీషా పటేల్. ఫస్ట్ మూవీతోనే ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత నికీషా పటేల్ అంతగా సరైన బ్రేక్ తీసుకోలేదు.
కొమరం పులి తర్వాత నికీషా పటేల్ పలు చిత్రాల్లో నటించి ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది. అందం, అభినయంతో మెప్పించిన ఈ బ్యూటీ ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా రాణించలేకపోయింది. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన ఓం 3డి చిత్రంలో నటించింది. ఆ తర్వాత అరకు రోడ్డులో, గుంటూరోడు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. తెలుగులోనే కాకుండాడ తమిళ్, కన్నడ భాషల్లోనూ నటించింది.
చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నికీషా ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఆడపాదడపా ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. అప్పటికీ ఇప్పటికీ అదే అందంతో కట్టిపడేస్తున్నా కాస్త బొద్దుగా కనిపిస్తుంది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‌గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్ను ఇప్పుడు చూస్తే షాకే..
Tollywood: ఫోక్ సాంగ్‌తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్గా అదరగొట్టేసింది..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.