వంటిట్లో వాముండగా.. బెంగెందుకు దండగా!

31 October 2024

TV9 Telugu

TV9 Telugu

ప్రతి ఇంటి వంటింట్లో రకరకాల మసాలా దినులు ఉంటాయి. ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. వీటిల్లో వాము తప్పనిసరిగా ఉంటుంది

TV9 Telugu

అజీర్తి, దగ్గు.. వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను వాముతో ఇట్టే దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. వాములో ప్రొటీన్, ఫైబర్, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం, ఐరన్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి

TV9 Telugu

వామును ఆయుర్వేదంలో అనేక రకాల వ్యాధులకు చికిత్స చేయడంలో ఉపయోగిస్తారు. అసిడిటీతో బాధపడేవారికి వాము బలేగా ఉపయోగపడుతుంది

TV9 Telugu

వాములో థైమోల్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ గింజలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. బీపీని కూడా నియంత్రణలో ఉంచుతాయి. జీవక్రియను పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

TV9 Telugu

సులువుగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అసిడిటీతో బాధపడేవారికి వామును మించిన ఔషధం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. వాములో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ దగ్గు, ఆస్తమా.. వంటి ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది

TV9 Telugu

గ్లాసు నీళ్లలో ఒక టీస్పూన్ వాము, ఒక టీస్పూన్ జీలకర్ర.. వేసి బాగా మరిగించాలి. అసిడిటీతో బాధపడుతున్నప్పుడు ఈ మిశ్రమాన్ని తాగితే సమస్య నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది

TV9 Telugu

వాములో ఉండే నియాసిన్ గుండె సంబంధిత సమస్యలు దరి చేరకుండా కాపాడుతుంది. కొంచెం వామును నీళ్లలో వేసి మరిగించి రోజూ పరగడుపున తాగితే గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి

TV9 Telugu

గర్భం దాల్చిన మహిళలకు, పాలిచ్చే తల్లులకు వాము చాలా ఉపయోగపడుతుంది. కడుపుతో ఉండే మహిళలకు సాధారణంగా ఎదురయ్యే మలబద్ధకం, అజీర్తిని ఇది దూరం చేస్తుంది. అలాగే కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది