Oats Bellam Payasam: ఓట్స్ బెల్లం పాయసం.. రుచి చూస్తే అస్సలు వదిలి పెట్టరు..
సాధారణంగా పాయసం అంటే ఇంట్లో ఏదన్నా పండుగలు, ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు చేస్తూ ఉంటారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. పంచదార కంటే బెల్లం వేసుకుని తింటే ఆరోగ్యానికి మరింత మంచిది. ఇందులో పాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇందులో ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఇంత రుచి కరమైన పాయసాన్ని మరింత రుచిగా, ఆరోగ్యంగా కూడా తయారు చేసుకోవచ్చు. బియ్యానికి బదులు ఓట్స్‌తో పాయసం తయారు చేస్తే.. హెల్త్‌కి మరింత బెస్ట్. ఇది డయాబెటీస్ పేషెంట్లకు, బీపీ ఉన్నవాళ్లకు..

సాధారణంగా పాయసం అంటే ఇంట్లో ఏదన్నా పండుగలు, ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు చేస్తూ ఉంటారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. పంచదార కంటే బెల్లం వేసుకుని తింటే ఆరోగ్యానికి మరింత మంచిది. ఇందులో పాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇందులో ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఇంత రుచి కరమైన పాయసాన్ని మరింత రుచిగా, ఆరోగ్యంగా కూడా తయారు చేసుకోవచ్చు. బియ్యానికి బదులు ఓట్స్‌తో పాయసం తయారు చేస్తే.. హెల్త్‌కి మరింత బెస్ట్. ఇది డయాబెటీస్ పేషెంట్లకు, బీపీ ఉన్నవాళ్లకు, వెయిట్ లాస్ అయ్యేవారికి చాలా మంచిది. ఇంత హెల్దీ, టేస్టీ ఓట్స్ పాయసాన్ని ఎలా తయారు చేస్తారు. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్ పాయసానికి కావాల్సిన పదార్థాలు:
ఓట్స్, కొబ్బరి పాలు, కొబ్బరి ముక్కలు నెయ్యి, యాలకుల పొడి, బెల్లం పొడి, డ్రై ఫ్రూట్స్.
ఓట్స్ పాయసం తయారీ విధానం:
ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఓట్స్ వేసుకుని సన్న మంట మీద సన్నగా ఫ్రై చేయాలి. రంగు మారాక తీసి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఆ తర్వా ఇందులో డ్రై ఫ్రూట్స్‌ని సన్నగా కట్ చేసి వేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా తీసుకుని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇందులోనే బెల్లం, కొద్దిగా నీళ్లు వేసి కాస్త కరిగేదాకా కలపాలి. కొద్దిగా కరగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని చల్లారాక వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక పాత్ర తీసుకుని ఇందులో వేయించుకున్న ఓట్స్, బెల్లం పానకం, కొబ్బరి ముక్కలు, కొబ్బరి పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద పెట్టాలి. వీటిని మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించాలి. చిన్న మంట మీద పది నిమిషాలు ఉడికించాక యాలకుల పొడి వేసి కలపాలి. డ్రై ఫ్రూట్స్ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ఓట్స్ పాయసం సిద్ధం. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.








