Nuvvula Gongura Pachadi: కారంగా నువ్వుల గోంగూర పచ్చడి.. వేడి అన్నంలోకి తింటే ఆహా!
గోంగూర పచ్చడి అంటేనే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతాయి. పుల్లగా కారంగా చాలా రుచిగా ఉంటుంది. అందులో నువ్వులు వేసి చేసుకుంటే ఆ రుచి అద్భుతం అంతే. ఈ పచ్చడి ఎంతో ఆరోగ్యమే కాకుండా.. చాలా రుచిగా కూడా ఉంటుంది. వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తింటే ఆ రుచికి.. బిర్యానీ కూడా సరిపోదు. అంత రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి నిల్వ కూడా ఉంటుంది. చాలా సింపుల్‌గా, తక్కువ సమయంలో..

గోంగూర పచ్చడి అంటేనే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతాయి. పుల్లగా కారంగా చాలా రుచిగా ఉంటుంది. అందులో నువ్వులు వేసి చేసుకుంటే ఆ రుచి అద్భుతం అంతే. ఈ పచ్చడి ఎంతో ఆరోగ్యమే కాకుండా.. చాలా రుచిగా కూడా ఉంటుంది. వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తింటే ఆ రుచికి.. బిర్యానీ కూడా సరిపోదు. అంత రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి నిల్వ కూడా ఉంటుంది. చాలా సింపుల్‌గా, తక్కువ సమయంలో చేసుకోవచ్చు. ఇంత రుచిగా ఉండే ఈ పచ్చడిని ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
గోంగూర నువ్వుల పచ్చడికి కావాల్సిన పదార్థాలు:
గోంగూర. నువ్వులు, ఎండు మిర్చి, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, తాళింపు దినుసులు, నెయ్యి.
గోంగూర నువ్వుల పచ్చడి తయారీ విధానం:
గోంగూర పచ్చడి చేయడానికి ముందుగా గోంగూర ఆకులను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి.. నువ్వులు దోరగా వేయించి పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, ధనియాలు కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో ఆయిల్ వేసి ఎండు మిర్చి వేయించి తీసుకోవాలి. ఈ కడాయిలోనే మరి కొద్దిగా ఆయిల్ వేసి గోంగూర ఆకులు వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.
ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని.. ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, ఎండు మిర్చి, నువ్వులు, కరివేపాకు, వెల్లుల్లి, ఉప్పు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని మరీ పొడిలా కాకుండా గ్రౌండ్ చేసుకోవాలి. ఆ తర్వాత గోంగూర కూడా వేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఈ పచ్చడికి తాళింపు పెడితే సరిపోతుంది. అంతే ఎంతో రుచిగా ఉండే గోంగూర నువ్వుల పచ్చడి సిద్ధం. ఇందులో పచ్చి మిర్చి కూడా వేసి చేసుకోవచ్చు.








