AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutton Donne Biryani: అదిరేలా మటన్ దొన్నె బిర్యానీ.. ఇంట్లోనే ఈజీగా చేసేయండి..

బిర్యానీలు అంటే చాలా మందికి ఇష్టం. ఆదివారం వచ్చిందంటే బిర్యానీ తినాలని అనుకుంటూ ఉంటారు. బిర్యానీల్లో ఎన్ని వెరైటీలు ఉన్నా ఇంకా ఇంకా స్పెషల్‌గా తినాలని అనుకుంటూ ఉంటారు. అందులోనూ ముస్లింలు చేసే బిర్యానీలు మరింత రుచిగా ఉంటాయి. ఎప్పుడూ హైదరాబాద్ బిర్యానీలే కాకుండా.. ఇలా వెరైటీగా మటన్ దొన్నె బిర్యానీ కూడా ట్రై చేయండి. చాలా మందికి దొన్నె బిర్యానీల గురించి తెలిసే ఉంటుంది. ఇంత రుచిగా ఉండే ఈ మటన్ దొన్నె..

Mutton Donne Biryani: అదిరేలా మటన్ దొన్నె బిర్యానీ.. ఇంట్లోనే ఈజీగా చేసేయండి..
Mutton Donne Biryani
Chinni Enni
|

Updated on: Sep 22, 2024 | 6:28 PM

Share

బిర్యానీలు అంటే చాలా మందికి ఇష్టం. ఆదివారం వచ్చిందంటే బిర్యానీ తినాలని అనుకుంటూ ఉంటారు. బిర్యానీల్లో ఎన్ని వెరైటీలు ఉన్నా ఇంకా ఇంకా స్పెషల్‌గా తినాలని అనుకుంటూ ఉంటారు. అందులోనూ ముస్లింలు చేసే బిర్యానీలు మరింత రుచిగా ఉంటాయి. ఎప్పుడూ హైదరాబాద్ బిర్యానీలే కాకుండా.. ఇలా వెరైటీగా మటన్ దొన్నె బిర్యానీ కూడా ట్రై చేయండి. చాలా మందికి దొన్నె బిర్యానీల గురించి తెలిసే ఉంటుంది. ఇంత రుచిగా ఉండే ఈ మటన్ దొన్నె బిర్యానీలను ఇంట్లో కూడా మనం తయారు చేసుకుని తినవచ్చు. మరి మటన్ దొన్నె బిర్యానీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మటన్ దొన్నె బిర్యానీకి కావాల్సిన పదార్థాలు:

మటన్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, బియ్యం, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకులు, పసుపు, కారం, ఉప్పు, నెయ్యి, ఆయిల్.

మటన్ దొన్నె బిర్యానీ తయారీ విధానం:

ముందుగా మటన్‌ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టకోవాలి. ఇందులో కొద్దిగా కారం, ఉప్పు, కొద్దిగా పెరుగు, ఆయిల్, పసుపు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఇందులో కొద్దిగా నెయ్యి, ఆయిల్ వేసి అందులో ధనియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకులు వేసి సువాసన వచ్చేంత వరకే ఫ్రై చేయాలి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు వీటిని చల్లార్చి.. వాటిని మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్రెజర్ కుక్కర్ పెట్టుకోవాలి. ఇందులోనే ఆయిల్ వేసి.. మ్యారినేట్ చేసుకున్న మటన్ వేయాలి. ఓ రెండు గ్లాసుల నీటిని వేసి.. 8 నుంచి 10 నిమిషాలు ప్రెజర్‌పై ఉడికించాలి. ఇలా ఉడికిన మటన్ పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఇదే కుక్కర్‌లో మళ్లీ కొద్దిగా ఆయిల్ వేసి ఇందులో మసాలా పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత కడిగిన బియ్యం, మటన ముక్కలు, కొద్దిగా నీళ్లు వేసి బియ్యానికి సరిపడా వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకే ఉడికించాలి. అంతే ఎంతో రుచిగా ఉండే టేస్టీ మటన్ దొన్నె బిర్యానీ సిద్దం.

Follow Us
ఆ సినిమా కోసం 2 నెలల్లో 16 కిలోలు తగ్గా.. సత్యదేవ్ ..
ఆ సినిమా కోసం 2 నెలల్లో 16 కిలోలు తగ్గా.. సత్యదేవ్ ..
బియ్యంలో పురుగులు పడుతున్నాయా?ఈ చిన్న చిట్కాలతో సమస్యకు గుడ్‌బై !
బియ్యంలో పురుగులు పడుతున్నాయా?ఈ చిన్న చిట్కాలతో సమస్యకు గుడ్‌బై !
మరో రూ.5 మేర పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? కారణం ఇదే!
మరో రూ.5 మేర పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? కారణం ఇదే!
చేపలు తిన్న తర్వాత శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
చేపలు తిన్న తర్వాత శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
స్టార్ హీరోలకే షాకిచ్చిన 63 ఏళ్ల హీరోయిన్..
స్టార్ హీరోలకే షాకిచ్చిన 63 ఏళ్ల హీరోయిన్..
ఇక అలాంటివేమి కుదరదు..వంట నూనెల ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం
ఇక అలాంటివేమి కుదరదు..వంట నూనెల ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం
బొద్దింకలను తరిమికొట్టే పవర్ ఫుల్ వెపన్స్.. ఈ 3 మీ ఇంట్లో ఉంటే..
బొద్దింకలను తరిమికొట్టే పవర్ ఫుల్ వెపన్స్.. ఈ 3 మీ ఇంట్లో ఉంటే..
ఛాలెంజ్‌..జస్ట్‌ 10 రోజులు టీ తాగడం మానేస్తే,.శరీరంలో జరిగేది ఇదే
ఛాలెంజ్‌..జస్ట్‌ 10 రోజులు టీ తాగడం మానేస్తే,.శరీరంలో జరిగేది ఇదే
జీలకర్ర vs మెంతుల నీళ్లు.. పొట్ట కొవ్వు తగ్గించడానికి ఏది బెస్ట్?
జీలకర్ర vs మెంతుల నీళ్లు.. పొట్ట కొవ్వు తగ్గించడానికి ఏది బెస్ట్?
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వాతావరణం ఎలా ఉంటుంది..?