AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mushroom Soup: మష్రూమ్స్‌తో వేడి వేడిగా ఇలా సూప్ చేయండి.. టేస్ట్ అదుర్స్!

రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాల్లో పుట్ట గొడుగులు కూడా ఒకటి. వీటితో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకుంటూ ఉంటారు. మష్రూమ్స్ తినడం వల్ల బీపీ, షుగర్ అనేవి అదుపులో ఉంటాయి. మష్రూమ్స్‌తో కేవలం వంటలే కాకుండా సూప్ కూడా తయారు చేసుకోవచ్చు. సాధారణంగా ఇవి రెస్టారెంట్లలో లభిస్తాయి. అదే రుచితో ఇంట్లో కూడా మష్రూమ్ సూప్ తయారు చేసుకోవచ్చు..

Mushroom Soup: మష్రూమ్స్‌తో వేడి వేడిగా ఇలా సూప్ చేయండి.. టేస్ట్ అదుర్స్!
Mushroom Soup
Chinni Enni
| Edited By: |

Updated on: Jan 19, 2025 | 9:14 PM

Share

చలి కాలంలో ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు తీసుకోవాలి. ఇమ్యూనిటీ ఫుడ్స్ తినడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. దీంతో ఎలాంటి వ్యాధులు, రోగాలను అయినా తట్టుకునే శక్తి వస్తుంది. ఇలా రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాల్లో పుట్ట గొడుగులు కూడా ఒకటి. వీటితో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకుంటూ ఉంటారు. మష్రూమ్స్ తినడం వల్ల బీపీ, షుగర్ అనేవి అదుపులో ఉంటాయి. మష్రూమ్స్‌తో కేవలం వంటలే కాకుండా సూప్ కూడా తయారు చేసుకోవచ్చు. సాధారణంగా ఇవి రెస్టారెంట్లలో లభిస్తాయి. అదే రుచితో ఇంట్లో కూడా మష్రూమ్ సూప్ తయారు చేసుకోవచ్చు. మష్రూమ్స్ అంటే ఇష్టం ఉండేవారు ఒకసారి ట్రై చేయండి. చలి కాలంలో ఇలాంటి సూప్స్ తాగుతూ ఉండాలి.

మష్రూమ్ సూప్‌కి కావాల్సిన పదార్థాలు:

మష్రూమ్, బటర్, ఉల్లిపాయ తరుగు, స్ప్రింగ్ ఆనియన్స్ తరుగు, అల్లం వెల్లుల్లి గరుతు, కార్న్ ఫ్లోర్ పౌడర్, వాము, ఫ్రెష్ క్రీమ్, క్యారెట్ తరుగు, మిరియాల పొడి, కొత్తిమీర, ఉప్పు.

మష్రూమ్ సూప్‌ తయారీ విధానం:

ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా బటర్ వేసి అందులో కార్న్ ఫ్లోర్ వేసి వేయించి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో మరింత బటర్ వేసి మష్రూమ్స్ వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఉల్లి తరుగు, అల్లం, వెల్లుల్లి తరుగు, క్యారెట్ తరుగు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి అంతా ఓ పది నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాము లేదంటే వాము పేస్ట్ వేసి మొత్తం కలపాలి.

ఇవి కూడా చదవండి

ఇవన్నీ వేగాక నీటిలో కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసి చిన్న మంట మీద ఉడికించాలి. ఆ తర్వాత కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసి అంతా కలపాలి. సూప్ దగ్గర పడుతున్న సమయంలో కొద్దిగా మిరియాల పొడి, కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే టేస్టీ మష్రూమ్ సూప్ సిద్ధం. ఈ చలి కాలంలో వేడి వేడిగా తాగిలే భలే రుచిగా ఉంటుంది.

Follow Us
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?