Jonna Laddu: పిల్లలకు పెద్దలకు నచ్చే జొన్న లడ్డూలు.. టేస్ట్ వేరే లెవల్!

జొన్నలతో ఇప్పుటికే మనం ఎన్నో రెసిపీలు తెలుసుకున్నాం. తాజాగా మీ కోసం మరో కొత్త ఐటెమ్ తీసుకొచ్చాం. అవే జొన్న లడ్డూలు. ఇవి చేయడం కూడా సింపులే. చాలా తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. పిల్లలకు లంచ్ బాక్సులో కానీ, ఇంటికి వచ్చాక కానీ ఇస్తే ఆరోగ్యం. వారికి కూడా చక్కగా పోషకాలు అందుతాయి..

Jonna Laddu: పిల్లలకు పెద్దలకు నచ్చే జొన్న లడ్డూలు.. టేస్ట్ వేరే లెవల్!
Jonna Laddu

Edited By:

Updated on: Jan 19, 2025 | 7:52 PM

ఇంట్లో పిల్లలు ఉన్నారంటే ఏదో ఒక స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉండాలి. ఎప్పుడూ ఒకేలా చేసినా వారికి బోర్ కొడుతూ ఉంటాయి. లడ్డూల్లో ఎక్కువగా సున్నుండ, రవ్వ లడ్డూ వంటివి తయారు చేస్తూ ఉంటారు. కానీ మనకు లభించే మిల్లేట్స్‌తో కూడా హెల్దీగా పిల్లలకు స్నాక్స్ తయారు చేసి పెట్టొచ్చు. జొన్నలతో ఇప్పుటికే మనం ఎన్నో రెసిపీలు తెలుసుకున్నాం. తాజాగా మీ కోసం మరో కొత్త ఐటెమ్ తీసుకొచ్చాం. అవే జొన్న లడ్డూలు. ఇవి చేయడం కూడా సింపులే. చాలా తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. పిల్లలకు లంచ్ బాక్సులో కానీ, ఇంటికి వచ్చాక కానీ ఇస్తే ఆరోగ్యం. వారికి కూడా చక్కగా పోషకాలు అందుతాయి. మరి ఈ జొన్న లడ్డూలను ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

జొన్న లడ్డూలకు కావాల్సిన పదార్థాలు:

జొన్నలు, బెల్లం, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి.

ఇవి కూడా చదవండి

జొన్న లడ్డూలు తయారీ విధానం:

ముందుగా జొన్నలను పిండి పట్టించుకోవాలి. పిండిని సున్నుండల పొడిలా కాస్త బరకగా పట్టిస్తే తినేందుకు రుచిగా ఉంటాయి. ఈ పిండిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి.. జొన్న పిండి వేసి దోరగా వేయించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత జొన్న పిండిలో బెల్లం తురుము, నెయ్యి, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా కావాలి అనుకునేవారు సన్నగా కట్ చేసుకుని కిస్ మిస్, బాదం, జీడిపప్పు వేసుకోవచ్చు. ఇలా అన్నీ కలిపి మీకు నచ్చిన సైజులో లడ్డూలను చుట్టుకోండి. దాదాపు పది రోజుల వరకు నిల్వ ఉంటాయి. కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు తయారు చేసుకుని తినవచ్చు.