Aloo Tikki: ఈజీగా తక్కువ సమయంలో రెడీ అయ్యే ఆలూ టిక్కీ..
ఆలూతో చాలా తక్కువ సమయంలో టేస్టీగా చేసే వాటిల్లో ఈ ఆలూ టిక్కీ కూడా ఒకటి. ఇది చాలా రుచిగా ఉంటాయి. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు...
బంగాళదుంప అంటే చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. వీటితో ఎలాంటి కర్రీస్ చేసినా చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా చాలా మంది వేపుళ్లు తింటూ ఉంటారు. ఈవినింగ్ స్నాక్ కూడా రుచిగా ఉంటాయి. రెస్టారెంట్లలో ఆలూతో ఎన్నో వందల రకాల స్టైల్‌లో రెసిపీలు చేస్తూ ఉంటారు. ఇలా ఆలూతో చాలా తక్కువ సమయంలో టేస్టీగా చేసే వాటిల్లో ఈ ఆలూ టిక్కీ కూడా ఒకటి. ఇది చాలా రుచిగా ఉంటాయి. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ ఆలూ టిక్కీలను ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఆలూ టిక్కీలకు కావాల్సిన పదార్థాలు:
ఉడికించిన బంగాళ దుంపలు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, జీలకర్ర, ఆవాలు, గరం మసాలా, చాట్ మసాలా, బియ్యం పిండి, కొత్తిమీర, ఆయిల్.
ఆలూ టిక్కీలు తయారీ విధానం:
ముందుగా ఆలుగడ్డలను ఉడికించి తొక్క తీసి మెదిపి పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఇందులో కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, జీలకర్ర, ఆవాలు, గరం మసాలా, చాట్ మసాలా, బియ్యం పిండి, కొత్తిమీర వేసి అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని రౌండ్ షేప్ లేదా మీకు నచ్చిన షేపులో చేసి పక్కన పెట్టుకోండి. మరింత క్రిస్పీగా కావాలి అనుకునేవారు బ్రెడ్ పొడిలో అటూ ఇటూ అద్దండి. వీటిని పాన్ ఫ్రై లేదా డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. బ్రెడ్ పొడి చల్లాం కాబట్టి డీప్ ఫ్రై చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి.. అందులో టిక్కీలను వేసి రెండు వైపులా వేయించుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ఆలూ టిక్కీలు సిద్ధం. వీటిని వేడి వేడిగా అప్పటికప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటాయి. గ్రీన్ చట్నీ లేదా సాస్‌తో తిన్నా బాగుంటాయి.