చలికాలం వ్యాధుల బారిన పొడద్దంటే..
Narender Vaitla
24 November
2024
చలికాలం వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే నువ్వులను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటిలోని మంచి గుణాలు రోగాల బారిన పడకుండా కాపాడుతాయి.
చాలా మంది చలి కారణంగా వ్యాయామానికి దూరమవుతుంటారు. అయితే కచ్చితంగా రోజూ 30 నిమిషాలైనా వ్యాయామం చేయడం అలవాటుగా మార్చుకోవాలి
ఇక కచ్చితంగా తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. రోజూ 7 నుంచి 8 గంటల నిద్ర పోవాలి. నిద్రతో ఎన్నో రకాల వ్యాధులు దరిచేరవు.
చలికాలంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా చలికాలంలో ఉన్ని దుస్తులను తప్పక ధరించాలి. ముఖ్యంగా చెవుల్లోకి చల్లగాలి వెలల్కుండా చూసుకోవాలని చెబుతున్నారు.
ఉదయాన్నే ఎండలో కాసేపైనా గడపాలి. చలికాలంటో విటమిన్ డీ లోపం సంభవించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉదయం ఎండలో కాసేపైనా గడపాలి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..