రోజూ ఈ గింజలు తింటే.. జరిగే మార్పులివే 

Narender Vaitla

24 November 2024

ఈ విత్తనాల్లో లిగ్నాన్స్ అని పిలిచే పాలిఫెనాల్ ఉంటుంది, ఇవి శరీరంలో యాంటీ ఆక్సిడెంట్‌లా పని చేస్తాయి.ఇది క్యాన్సర్‌ కణాలను దూరం చేయడంలో ఉపయోగపడుతుంది.

శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడంలో సన్‌ ఫ్లవర్‌ సీడ్స్‌ ఉపయోగపడతాయి. ఇందులోని ఉండే ఒమేగా యాసిడ్స్‌ శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది.

బీపీతో బాధపడేవారికి కూడా సన్‌ ఫ్లవర్‌ సీడ్స్‌ బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆసిడెంట్స్‌ రక్తపోటును కంట్రోల్‌ చేస్తుంది. 

పొద్దు తిరుగుడు విత్తనాల్లో ఐరన్, జింక్, క్యాల్షయం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా పొద్దు తిరుగుడు విత్తనాలు ఉపయోగపడతాయి. ఇందులోని మెగ్నీషియం ఒత్తిడిని దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

పొద్దు తిరుగుడు విత్తనాల్లో ఉండే విటమిన్‌ ఈ కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో పొద్దు తిరుగుడు విత్తనాలు ఉపయోగపడతాయి. ఇందులోని విటమిన్‌ సి చర్మాన్ని సంరక్షిస్తుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం