చాలా మందికి ప్రయాణాల్లో పల్లీలు తినడం మహా ఇష్టం. ఇవి రుచిగానూ ఉంటాయి, ఆరోగ్యాన్నీ ఇస్తాయి. వేరుశనగపప్పుల్లో క్యాల్షియం, ఐరన్, కాపర్, ఫొలేట్, భాస్వరం, మాంగనీస్, మెగ్నీషియం, బి1, బి3, బి6, ఇ- విటమిన్లు ఉంటాయి
TV9 Telugu
ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. గుండె జబ్బులను నిరోధిస్తాయి. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తాయి. వీటిలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, ఫాటీ యాసిడ్స్ చర్మాన్ని సంరక్షిస్తాయి
TV9 Telugu
పల్లీల్లోని పోలీ, మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫాట్స్, విటమిన్ బి3లు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. వయసు రీత్యా వచ్చే అల్జీమర్స్ లాంటి సమస్యలను కూడా తగ్గిస్తాయని పరిశోధనల్లో తేలింది
TV9 Telugu
మూడ్స్‌ను క్రమబద్ధంచేసి, యాంటీడిప్రెసెంట్లుగా పనిచేసే ఎమినో యాసిడ్స్ పల్లీలు అందిస్తాయి. వాటివల్ల ఆందోళన తలెత్తదు. వేరుశనగ ప్రొటీన్లు ఉన్న ఆహారం అయినందున ఆకలి తీరుతుంది
TV9 Telugu
అయితే చాలా మంది చలికాలంలో వేరుశెనగలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కానీ వీటిని సరైన మార్గంలోనే తినాలి. లేదంటే లేనిపోని చిక్కుల్లో పడతారు
TV9 Telugu
వేరుశెనగల్లో ప్రోటీన్‌కు చాలా అధికంగా ఉంటుంది. అందుకే వీటిని పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకుంటే మంచిది. ముఖ్యంగా వేయించిన పల్లీలు పెద్ద మొత్తంలో తీసుకుంటే, అది కడుపు నొప్పికి దారి తీస్తుంది
TV9 Telugu
అంతేకాకుండా ఎసిడిటీ, గ్యాస్, అపానవాయువు వంటి సమస్యలను కలిగిస్తుంది. బదులుగా వేరుశెనగలను నానబెట్టి తినాలని డాక్టర్లు చెబుతున్నారు
TV9 Telugu
20 నుండి 25 పల్లీలు రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే తింటే మంచిదట. ఇలా చేస్తే శరీరానికి సరిపడా ప్రోటీన్, కాల్షియం రెండూ అందుతాయి. ఎముకలు కూడా బలపడతాయి
TV9 Telugu
పిల్లలకు బెల్లంతో చేసిన వేరుశెనగ చిక్కి తినిపించాలి. దీని వల్ల శరీరానికి ప్రొటీన్, క్యాల్షియం రెండూ అందుతాయి. పరిమిత మోతాదులో వేయించిన పల్లీలు తినవచ్చు. అయితే మసాలా కలిపి తినకూడదు