Aloo Puri: ఆలుగడ్డలతో టేస్టీ పూరీలు.. వరుస పెట్టి తింటూనే ఉంటారు..

పూరీలు అంటే ఎంతో మంది ఇష్టంగా తింటారు. వేడి వేడి పూరీలు అలా వేస్తూ ఉంటే.. ఒకదాని తర్వాత మరొకటి తింటూ ఉంటారు. బయట చేసే పూరీల కంటే ఇంట్లో చేసినవే ఆరోగ్యానికి కాస్త మంచిది. అక్కడ వాళ్లు ఎలాంటి ఆయిల్ వాడతారో కూడా తెలీదు. వేడి చేసిన ఆయిల్ మళ్లీ వేడి చేసి వాడతారు..

Aloo Puri: ఆలుగడ్డలతో టేస్టీ పూరీలు.. వరుస పెట్టి తింటూనే ఉంటారు..
Aloo Puri
Follow us
Chinni Enni

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 24, 2024 | 6:59 PM

పూరీలు అంటే ఎంతో మంది ఇష్టంగా తింటారు. వేడి వేడి పూరీలు అలా వేస్తూ ఉంటే.. ఒకదాని తర్వాత మరొకటి తింటూ ఉంటారు. బయట చేసే పూరీల కంటే ఇంట్లో చేసినవే ఆరోగ్యానికి కాస్త మంచిది. అక్కడ వాళ్లు ఎలాంటి ఆయిల్ వాడతారో కూడా తెలీదు. వేడి చేసిన ఆయిల్ మళ్లీ వేడి చేసి వాడతారు. కాస్త శ్రమిస్తే ఇంట్లో ఆరోగ్యంగా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడూ చేసుకునే వాటి కంటే ఒక్కోసారి కాస్త వెరైటీ టచ్ ఇవ్వాలి. అలా ఆలు గడ్డలతో కూడా కలిపి పూరీలు తయారు చేసుకోవచ్చు. ఇవి క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. చెబుతుంటేనే నోట్లో నీళ్లూ ఊరుతున్నాయి. అయితే వీటికి కాస్త సమయం పడుతుంది. కాబట్టి ఎప్పుడైనా సండే ఫ్రీగా ఉన్నప్పుడు ట్రై చేయండి. మరి ఆలు గడ్డల పూరీలకు కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలు గడ్డల పూరీలకు కావాల్సిన పదార్థాలు:

ఉడికించిన బంగాళ దుంపలు, గోధుమ పిండి, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర తరుగు, ఆయిల్.

ఇవి కూడా చదవండి

ఆలు గడ్డల పూరీలు తయారీ విధానం:

ముందుగా బంగాళ దుంపల్ని ఉడికించి తొక్క తీసి ఓ బౌల్ లోకి తీసుకోండి. దుంపల్ని బాగా మెదిపాలి. ఇందులో గోధుమ పిండి, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపండి. ఆలు గడ్డల్లో ఉండే నీరే సరిపోతుంది. చూసుకుని జాగ్రత్తగా మిక్స్చేసుకోవాలి. లేదంటే పిండి జారుగా అయిపోతుంది. ఆ తర్వాత వీటిని పూరీల్లా వత్తుకుని.. ఆయిల్‌లో వేసి ఫ్రై చేయండి. అంతే ఎంతో రుచిగా ఉండే ఆలూ పూరీలు సిద్ధం. వీటిని నేరుగా వేడి వేడిగా ఉన్నప్పుడు తిన్నా టేస్టీగానే ఉంటాయి. లేదంటే పూరీ కర్రీ, ఇతర కర్రీలతో కూడా తినవచ్చు. చికెన్, మటన్, ఫిష్ పులుసుతో తింటే ఆహా వీటికి మరింత రుచి పెరుగుతుంది. మరి ఇంకెందుకు లేట్ ఎప్పుడైనా నాన్ వెజ్ వంటలు చేసుకున్నప్పుడు వీటిని కూడా ట్రై చేయండా. చాలా బాగుంటాయి.

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.