ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి... నిత్యం ఏదో ఓ ఆకుకూర ఆహారంగా తీసుకుంటే ఉత్సాహంగా ఉంటాం. ఆరోగ్యం కోసం రూ.వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు
TV9 Telugu
ఆకుకూరల్లో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండటం, ప్రొటీన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండటం వల్ల మన జీవనశైలిని మార్చే సత్తా వాటికి ఉందని వైద్యులు చెబుతుంటారు
TV9 Telugu
ప్రస్తుతం శీతాకాలం కావడంతో మార్కెట్లో రకరకాల ఆకుకూరలు దర్శనమిస్తుంటాయి. ప్రతి ఒక్కరూ వారి వారి అభీష్టాన్ని బట్టి ఆకు కూరలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు
TV9 Telugu
అందుకే ఈ సీజన్‌లో చాలా మంది ఆకు కూరగాయలను ఎక్కువగా తింటారు. అయితే ఆకు కూరలు అధికంగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని అంతా అనుకుంటారు. కానీ కొన్ని దుష్ర్పభావాలు కూడా ఉన్నయట
TV9 Telugu
ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలున్న వారు ఆకు కూరలు తినడం హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ కింది ఆరోగ్య సమస్యలున్న వారు వీటికి దూరంగా ఉండాలి
TV9 Telugu
ఎవరికైనా గ్యాస్ సంబంధిత సమస్యలు ఉంటే ఆకుకూరలు ఎక్కువగా తినకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఆకుకూరల్లో ఫోలేట్ అధికంగా ఉంటుంది. ఇది సమస్యను తీవ్రతరం చేస్తుంది
TV9 Telugu
అలాగే అలెర్జీ సమస్యలు ఉన్నవారు, గర్భిణీలు కూడా ఆకు కూరలు శీతాకాలంలో తినకూడదు. ఇంకా కీళ్ల నొప్పులు ఉన్నవారు ఆకుకూరలు ఎక్కువగా తినకూడదు ఎందుకంటే ఆకుకూరల్లో ఆక్సలేట్స్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది సమస్యను మరింత పెంచవచ్చు
TV9 Telugu
ఇక అధిక రక్తపోటుతో బాధపడేవారు వారు కూడా ఆకు కూరలు ఎక్కువగా తినకూడదు. ఇవి ప్రయోజనానికి బదులుగా మరింత హాని తలపెడతాయి. కాబట్టి మీకు ఇలాంటి సమస్యలుంటే వైద్యుల సలహా మేరకు వీటిని తీసుకోవడం మంచిది