AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green Tea Side Effects: గ్రీన్ టీని రోజుకు ఎన్నిసార్లు తాగాలి..? అతిగా తాగితే ఈ అనారోగ్య సమస్యలు ఎదుర్కొక తప్పదు..!

గ్రీన్ టీలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే అనేక మంచి అంశాలు ఉన్నాయి. గ్రీన్‌ టీ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది మన హృదయాన్ని బలపరుస్తుంది. మన బరువును నియంత్రిస్తుంది. మనకు తాజా అనుభూతిని కలిగిస్తుంది. అందుకే రోజూ తగిన మోతాదులో గ్రీన్ టీ తాగితే ఆరోగ్యం బాగుంటుంది.

Green Tea Side Effects: గ్రీన్ టీని రోజుకు ఎన్నిసార్లు తాగాలి..? అతిగా తాగితే ఈ అనారోగ్య సమస్యలు ఎదుర్కొక తప్పదు..!
Green Tea
Jyothi Gadda
|

Updated on: Feb 28, 2024 | 7:15 PM

Share

ఈ రోజుల్లో గ్రీన్ టీ మన వంటగదిలో ముఖ్యమైన వస్తువుగా మారింది. ముఖ్యంగా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు గ్రీన్‌ టీని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఇది మనల్ని రిఫ్రెష్ చేయడమే కాకుండా మన శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరచడంలో కూడా సహాయపడుతుంది. గ్రీన్ టీలో ఉండే గుణాలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. అయితే, మనం రోజుకు ఎంత గ్రీన్ టీ తాగాలో తెలుసా..? ఎక్కువగా తాగితే ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

గ్రీన్ టీ ఎంత తాగాలో తెలుసా..? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, రోజులో 2 లేదా 3 కప్పుల గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిది. గ్రీన్ టీని అంత పరిమాణంలో తాగడం వల్ల దాని ప్రయోజనాలను పొందుతాము. ఎటువంటి హాని ఉండదు. గ్రీన్ టీలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే అనేక మంచి అంశాలు ఉన్నాయి. గ్రీన్‌ టీ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది మన హృదయాన్ని బలపరుస్తుంది. మన బరువును నియంత్రిస్తుంది. మనకు తాజా అనుభూతిని కలిగిస్తుంది. అందుకే రోజూ తగిన మోతాదులో గ్రీన్ టీ తాగితే ఆరోగ్యం బాగుంటుంది.

పరిమిత పరిమాణంలో గ్రీన్ టీ తాగడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ మనం ఎక్కువ మోతాదులో తాగితే అది కొంత హాని కూడా కలిగిస్తుంది. గ్రీన్ టీలో కూడా కెఫిన్ ఉంటుంది. మనం ఎక్కువగా గ్రీన్ టీ తాగితే, మన శరీరంలో కెఫిన్ పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా, నిద్రలేమి, చిరాకు, తలనొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి

అంతేకాదు.. గ్రీన్ టీలో ఐరన్ శోషణను తగ్గించే టానిన్లు కూడా ఉన్నాయి. అంటే మనం ఆహారంతో పాటు గ్రీన్ టీని ఎక్కువగా తాగితే, లేదంటే ఆహారం తీసుకున్న వెంటనే గ్రీన్‌ టీ తాగటం వల్ల మన శరీరం ఆహారం నుండి ఇనుమును సరిగ్గా పొందలేకపోతుంది. ఇది రక్తహీనతకు కారణం కావచ్చు.

గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. ఎందుకంటే గ్రీన్ టీ ఎసిడిటీని పెంచుతుంది. ఇది కడుపులో చికాకు కలిగిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...