AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Sweet Recipe: ఆరోగ్యకరమైన బెల్లం గవ్వలు రెసిపీ..! సింపుల్ స్టెప్స్ తో కంప్లీట్ రెసిపీ మీకోసం..!

బెల్లం గవ్వలు ఒకప్పుడు తెలుగింటి వంటగదిలో తప్పనిసరిగా ఉండే ఆరోగ్యకరమైన స్వీట్. బెల్లం, గోధుమపిండితో తయారయ్యే ఈ క్రిస్పీ స్వీట్ పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తినేలా చేస్తుంది. నేటి ఫాస్ట్ ఫుడ్ కాలంలో మర్చిపోయిన ఈ వంటకాన్ని మళ్లీ మీ ముందుకు తీసుకొచ్చాను.

Healthy Sweet Recipe: ఆరోగ్యకరమైన బెల్లం గవ్వలు రెసిపీ..! సింపుల్ స్టెప్స్ తో కంప్లీట్ రెసిపీ మీకోసం..!
Healthy Sweets
Prashanthi V
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 02, 2025 | 7:26 AM

Share

పొరపాటున కూడా మర్చిపోరాని తెలుగింటి స్వీట్స్‌లో బెల్లం గవ్వలు ఒకటి. ఒకప్పుడు ఇంట్లో తప్పనిసరిగా చేసుకునే ఈ తీపి వంటకం.. ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ మధ్య మరిచిపోయిన స్థితికి చేరింది. కానీ బెల్లం గవ్వలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇందులో బెల్లం, గోధుమపిండి ఉండటంతో ఆరోగ్యానికి హాని కలిగించే రసాయన పదార్థాలు ఉండవు. పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి రుచి పాటించేందుకు ఈ స్వీట్ బెస్ట్ ఆప్షన్. ఈ వంటకం ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా..? క్రిస్పీగా, మృదువుగా ఉండేలా బెల్లం గవ్వలు చేసుకునే విధానం ఇప్పుడు మీకోసం.

కావాల్సిన పదార్థాలు

  • గోధుమపిండి – 1 ½ కప్పు
  • నెయ్యి – 2 స్పూన్లు
  • ఉప్పు – ½ స్పూను
  • వంట సోడా – ¼ స్పూను
  • నూనె – డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
  • బెల్లం – ¾ కప్పు

తయారీ విధానం

ఓ పెద్ద గిన్నెలో గోధుమపిండి, నెయ్యి, ఉప్పు, వంట సోడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలా మెత్తగా కలపాలి. పిండి మృదువుగా ఉండేలా చూసుకోవాలి. దీనిని మెత్తగా కలిపి 10 నిమిషాలు మూతపెట్టి పక్కకు పెట్టుకోవాలి.

ఇప్పుడు ఆ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని ఒక్కో ముద్దను గవ్వ ఆకారంలో మెల్లగా ఒత్తాలి. కొంతమంది ప్రత్యేకమైన గవ్వ పీట ఉపయోగిస్తారు. అది లేనివారు చేత్తోనే ఆకారం చేస్తుంటారు.

స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి. నూనె బాగా వేడెక్కాక సిద్ధం చేసుకున్న గవ్వలను అందులో వేయించాలి. అవి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.

మరో గిన్నెలో బెల్లం తీసుకుని అందులో అరకప్పు నీళ్లు పోసి మరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగి తీగపాకం వచ్చే వరకు వేడి చేయాలి. దీని కోసం బెల్లాన్ని వేళ్ల మధ్య తీసుకుని చూడాలి. తీగలా వస్తే పాకం సిద్ధం అయినట్టు. బెల్లం తీగపాకం వచ్చిన తర్వాత ముందుగా వేయించుకున్న గవ్వలను అందులో వేసి బాగా కలపాలి. అన్నీ గవ్వలూ బెల్లం పాకం పట్టేలా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత, గవ్వలు ఒకదానికొకటి అతుక్కుంటాయి. వాటిని మెల్లగా వేరు చేసుకోవాలి. గాలి చొరబడని కంటైనర్‌లో స్టోర్ చేయాలి. ఇలా చేస్తే మూడు వారాల వరకు తాజాగా ఉంటాయి.

ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి ఫ్రిజ్‌లో ఉంచాల్సిన అవసరం ఉండదు. అంతే కాదు బెల్లం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. పిల్లలకు పోషక విలువలతో కూడిన స్వీట్ కావాలంటే, మైదా పిండికి బదులుగా గోధుమపిండితోనే చేయడం ఉత్తమం.

విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..