AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Diet: కాలం మారుతోంది.. ఆహారంలో ఈ మార్పులు తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే..

Health Tips: ఈ సీజన్‌లో ఆహారం, పానీయాల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ఇందులో డీహైడ్రేషన్, స్కిన్ బర్న్, ఫీవర్, హీట్ స్ట్రోక్ మీ సమస్యలను..

Summer Diet: కాలం మారుతోంది.. ఆహారంలో ఈ మార్పులు తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే..
Summer Diet
Venkata Chari
|

Updated on: Feb 22, 2022 | 9:37 PM

Share

Summer Diet: దేశమంతటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. చలికాలం తర్వాత వేసవి(Summer) రాకకు ఇది సంకేతం. ఈ సీజన్‌లో ఆహారం, పానీయాల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చాలా చెడు పరిణామాలకు దారి తీస్తుంది. ఇందులో డీహైడ్రేషన్, స్కిన్ బర్న్, ఫీవర్, హీట్ స్ట్రోక్ మీ సమస్యలను పెంచుతాయి. వేసవి కాలంలో మీ ఆరోగ్యాన్ని(Health Tips) ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. వేసవిలో సీజనల్ డైట్ పాటించడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో తాజా పండ్లు, కూరగాయలను తినండి. వాటిలో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు, ఖనిజాలు, ఎంజైములు, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ ఉంటాయి. సీజనల్ ఫుడ్స్‌కు సహజంగానే మన శరీరాలను శుభ్రపరిచే, రోగాలను నయం చేసే సామర్థ్యం కూడా ఉంటుంది.

సూర్యకాంతిలో వేడి పెరగడంతో వేసవిలో, పిల్లలు, వృద్ధులు, అథ్లెట్లు, ఎండలో పనిచేసేవారు మరింత తీవ్రంగా ప్రభావితమవుతారు. సూర్యరశ్మి వల్ల వారి శరీరంలోని నీరు, ఉప్పు తగ్గుతుంది, నిర్జలీకరణం, తిమ్మిరి, అలసట, లోబీపీ ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే ఇంట్లో ఉంటూ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అంటే మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండేందుకు ప్రయత్నించండి. ఉష్ణోగ్రత, వేడి పెరగడం వల్ల మన శరీరం ఒత్తిడికి లోనవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది చిరాకు, అపసవ్యత, నిద్రలేమి, చర్మం పొడిబారటం, విటమిన్-ఖనిజ లోపాన్ని ప్రోత్సహిస్తుంది.

శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచాలి.. వేసవిలో నీరు, ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. అంటే రోజంతా మన ఎనర్జీ లెవెల్ మెయింటెన్ చేయగలిగే డైట్ పాటించాలి. దీని కోసం మీరు ఆకుకూరలు, బచ్చలికూర, దోసకాయ లేదా సలాడ్ వంటి వాటిని తినవచ్చు. ఆర్ద్రీకరణతో మాత్రమే వేడిని ఓడించవచ్చని నిపుణులు అంగీకరిస్తున్నారు. అందువల్ల, శరీరంలో నీటి కొరత ఉండకూడదు.

ఏమి తినాలి, ఏమి తినకూడదు? వేసవి కాలంలో శరీరాన్ని నిర్జలీకరణం నుంచి రక్షించడానికి కెఫిన్, టీ, కాఫీ లేదా ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం మానుకోండి. అలాగే మార్కెట్‌లో లభించే ప్యాకేజ్డ్ షుగర్ మిక్స్ జ్యూస్‌లకు దూరంగా ఉండండి. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినవద్దు. మసాలా, ఆమ్ల, నూనె, అధిక కేలరీల ఆహారాలు తినడం మానుకోండి. ఈ సీజన్‌లో ఆహారం సులభంగా చెడిపోతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు కూడా దారి తీస్తుంది. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే వాటిని తినడం మానుకోండి. కొన్ని కారణాల వల్ల మీరు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాల్సి వస్తే, రోజుకు 5 నుంచి 6 గ్లాసుల నీరు త్రాగడం ద్వారా సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నించండి.

మీరు సాధారణంగా రోజు తాగే నీరు తాగలేకపోతే, అందుకు బదులు నిమ్మకాయ, నారింజ ముక్కలు లేదా పుదీనా ఆకులు వేసి తాగవచ్చు. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు ఇవి పని చేస్తాయి. ఇది కాకుండా, మీరు కొబ్బరి నీరు కూడా తాగవచ్చు. నీరు, పచ్చి కూరగాయలు, పండ్లు తీసుకోవడం వల్ల మీ శరీరం హైడ్రేట్‌గా ఉండటమే కాకుండా, తగినంత శక్తిని కూడా ఇస్తుంది. మనకు దొరికే చాలా పండ్లు, ఆకుపచ్చ కూరగాయల్లో నీటి పరిమాణం ఎక్కువగా ఉంటుంది.

ఇందులో దోసకాయ, పుచ్చకాయ, ఆరెంజ్, క్యాబేజీ, టొమాటో, క్యారెట్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, సీతాఫలం, స్ట్రాబెర్రీ, క్యాప్సికమ్ వంటి కూరగాయాలు, పండ్లు ఉన్నాయి. మీరు వీటిని కడిగిన తర్వాత తినవచ్చు లేదా జ్యూస్‌లు, స్మూతీలు, షేక్‌లను తయారు చేసి తాగవచ్చు. ఇది కాకుండా, తులసి ఆకుల నీరు, బార్లీ నీరు, మజ్జిగ, ఐస్ గ్రీన్ టీ, నిమ్మరసం కూడా గొప్ప ఉపశమనాన్ని ఇస్తాయి.

Also Read: Fenugreek Water: ఉదయాన్నే ఈ నీరు తాగితే డయాబెటిస్‌ అదుపులో.. ఇంకా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు..!

Parents Care Tips: మీ చిన్నారులు అలసిపోయినట్లుగా కనిపిస్తున్నారా.. అయితే ఈ ఆహారాలను డైట్‌లో అందించండి..