Fenugreek Water: ఉదయాన్నే ఈ నీరు తాగితే డయాబెటిస్ అదుపులో.. ఇంకా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు..!
Fenugreek Water: ప్రస్తుతం ఎంతో మందిని డయాబెటిస్ వ్యాధి వెంటాడుతోంది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా వ్యాపిస్తోంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు జీవన శైలిలో మార్పు..
Fenugreek Water: ప్రస్తుతం ఎంతో మందిని డయాబెటిస్ వ్యాధి వెంటాడుతోంది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా వ్యాపిస్తోంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు జీవన శైలిలో మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. ఆహార నియమాలను పాటిస్తే అదుపులో ఉంటుంది. ఇక మన కొత్తమీర వాడినంత మెంతి గింజలను ఎక్కువగా వాడము. ఎందుకంటే ఇవి చేదుగా ఉంటాయి కాబట్టి. అయితే మెంతులు (Fenugreek)మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. రుచిని పెంచడంతోపాటు ఎన్నో ఆరోగ్య (Health) ప్రయోజనాలున్నాయి. వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మెంతులను అనేక రకాల ఉత్పత్తుల తయారీలో వాడుతుంటారు. మెంతి గింజల్లో విటమిన్ -సి,బి1,బి2, కాల్షియం వంటివి శరీరానికి కావాల్సిన పోషకాలు ఇందులో ఉంటాయి. మెంతులు చర్మం మెరిసేలా చేయడంలో, జట్టు పెరిగేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఉదయం (Morning) పూట పరగడుపున మెంతి గింజల నీటిని తాగడం వల్ల శరీరంలోని మలినాలను బయటకు పంపుతుంది. అలాగే మధుమేహం ఉన్న వారికి ఎంతగానో మేలు జరుగుతుంది. ఒకటిన్నర స్పూన్ మెంతి గింజలను తీసుకుని రాత్రంతా నానబెట్టాలి. ఇక ఉదయాన్నే నీటిని వడపోసి నీటిని తాగాలి.
మెంతి ద్రావణంతో బెనిఫిట్స్:
మెంతి ద్రావణం తాగడం వల్ల బరువు తగ్గవచ్చు. మెంతికూరలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. మన శరీరం బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మెంతి గింజల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శర్మానికి ఉపయోగకరంగా ఉంటాయి. మెంతి ఆకుల్లో ఉండే ప్రొటీన్ జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. ఇక మెంతి నీరు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. ఈ నీరు గుండెలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.
మధుమేహానికి చెక్
ప్రతీ నిత్యం మెంతి నీరు తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. మెంతి గింజల్లో ఉండే అమైనో ఆమ్లాలు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. మెంతి గింజ నీటిని నిత్యం 3 సార్లు తీసుకుంటే చాలా వరకు డయాబెటిస్ అదుపులో ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి: