Death in Sleep: ఆ వ్యాధి ఉన్నవారు నిద్రలోనే మరణించే అవకాశం.. ఎందుకంటే..?
Death in Sleep: నిద్ర సరిగ్గా లేకుంటే చాలా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఏ పనిమీద ధ్యాస పెట్టలేరు. చురుకుగా ఉండలేరు. నీరసంగా కనిపిస్తారు.
Death in Sleep: నిద్ర సరిగ్గా లేకుంటే చాలా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఏ పనిమీద ధ్యాస పెట్టలేరు. చురుకుగా ఉండలేరు. నీరసంగా కనిపిస్తారు. బరువు విపరీతంగా పెరుగుతారు. అందుకే నిపుణులు ప్రతిరోజు 8 గంటల నిద్ర తప్పనిసరని సూచించారు. రోజుకు కంటికి సరిపడ నిద్ర ఉంటే మెదడుకు ప్రశాంతత ఉండడమే కాకుండా.. అనారోగ్య సమస్యలు దరిచేరవు. కానీ కొన్ని వ్యాధులు ఉన్నవారు నిద్రలోనే మరణిస్తారు. అందులో ముఖ్యంగా మూర్ఛ వ్యాధి ఉన్నవారు నిద్రలోనే మరణించే అవకాశం ఉంటుంది. మూర్ఛ వ్యాధితో బాధపడేవారు నిద్రపోయేటప్పుడు బోర్లా పడుకోకూడదు. ఎందుకంటే ఒత్తిడి వల్ల ఒక్కోసారి మరణించే అవకాశాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. చాలా మంది పిల్లలు ఇలా పడుకోవడం వల్ల మరణించిన సందర్భాలు ఉన్నాయి.
ఇల్లినాయిస్‌లోని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ జేమ్స్ టావో ప్రకారం.. మూర్ఛ వ్యాధిలో మరణం సాధారణంగా నిద్రలో సంభవిస్తుంది. ఈ పరిశోధన కోసం 253 మంది వ్యాధిగ్రస్తులపై పరిశోధన చేశారు. ఈ అధ్యయనం ప్రకారం 73 శాతం మంది మూర్ఛ వ్యాధిగ్రస్తులు బోర్లా పడుకోవడం వల్ల మరణించినట్లు తెలిపారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 మిలియన్ల మంది మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారు.