- Telugu News Photo Gallery Viral photos Woman of britain consider herself a plus sized barbie doll netizens are trolling her
Viral Photos: లడ్డుగా ఉన్న ఈ సుందరికి బార్బీడాల్ అని ఫీలింగ్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!
Viral Photos: ఫిట్‌గా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి.. కానీ అనుకోకుండా ఊబకాయం బారిన పడుతారు. తర్వాత బరువు తగ్గడానికి వివిధ ప్రయత్నాలు చేస్తారు.
Updated on: Feb 22, 2022 | 3:51 PM

ఫిట్‌గా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి.. కానీ అనుకోకుండా ఊబకాయం బారిన పడుతారు. తర్వాత బరువు తగ్గడానికి వివిధ ప్రయత్నాలు చేస్తారు. కానీ ఈ రోజు ఒక లావైన యువతి గురించి తెలుసుకుందాం.

ఈ యువతి పేరు కాటలాన్ రెడ్డింగ్. ఈమె ప్లస్ సైజ్ మోడల్. లావు, అధిక బరువు ఉన్న మహిళల కోసం వివిధ బ్రాండ్లకి మోడల్‌గా పనిచేస్తుంది.

బ్రిటన్‌లోని ఎసెక్స్‌లో నివసించే కాటలాన్ ఆమె బరువు, ఊబకాయం కారణంగా విపరీతంగా ట్రోల్ చేయబడుతోంది. కానీ ఆమె వాటిని పట్టించుకోలేదు.

కాటలాన్ నిశ్చితార్థం కూడా జరిగింది. ఆమెకు కాబోయే భర్త పేరు సామ్ వోల్ఫ్. అతని నుంచి ఆమెకి పూర్తి మద్దతు దొరికింది. అందుకే ఊబకాయం వల్ల తనకి ఎలాంటి సమస్య లేదని చెప్పింది.

తాను ప్లస్ సైజ్ మోడలింగ్‌లో స్థిరపడుతానని తెలిపింది. ఆమె తనను తాను బార్బీ బొమ్మతో పోల్చుకుంటుంది. ఇది సన్నటి బార్బీ బొమ్మ కాదు ప్లస్ సైజ్ బార్బీ డాల్.



