AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Loss: మీ ఇంట్లో బియ్యం ఉన్నాయా.. అయితే ఈ పని చేయండి.. జుట్టు అసలే ఊడిపోదు..

చాలా మందిని వేధించే సమస్య జుట్టు(hair) రాలిపోవడం. మగవారికి జుట్టు రాలిపోయిన పెద్ద ఇబ్బంది ఉండదు కానీ..

Hair Loss: మీ ఇంట్లో బియ్యం ఉన్నాయా.. అయితే ఈ పని చేయండి.. జుట్టు అసలే ఊడిపోదు..
Hairfall Issue
Srinivas Chekkilla
|

Updated on: Feb 22, 2022 | 4:59 PM

Share

చాలా మందిని వేధించే సమస్య జుట్టు(hair) రాలిపోవడం. మగవారికి జుట్టు రాలిపోయిన పెద్ద ఇబ్బంది ఉండదు కానీ.. మహిళలకు జుట్టు రాలితే ఇబ్బంది పడతారు. అందుకే కురులను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం రకరకాల నూనెలు, షాంపూలు, హెయిర్ మాస్క్, కండిషనర్స్ వాడుతారు. ఇవన్ని వాడినా ఒక్కోసారి ఫలితం ఉండదు. బలమైన అందమైన శిరోజాలు కావాలంటే గంజి నీళ్ల(rice water)ను జుట్టుకు పట్టించాలని నిపుణులు చెబుతున్నారు. గంజిని రోజంతా ఉంచితే గంజి పులుస్తుంది. తరువాత ఆ గంజిని వేడి చేసి చల్లార్చాలి. అందులో కొన్ని చుక్కల అవసరమైన నూనె(oil)లు కలపాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకలు శుభ్రం చేసుకునేందుకు వాడాలి. ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గిపోయి, ఆరోగ్యమంతమైన జుట్టు మీ సొంతం అవుతుంది.

జుట్టు రాలడానికి చుండ్రు ముఖ్యమైన కారణం. చుండ్రు శిరోజాలను బలహీనంగా మార్చి, తొందరగా ఊడిపోయేలా చేస్తుంది. బియ్యం నీళ్లలో చుండ్రుకు కారణమయ్యే శిలీంద్రాన్ని తొలగించే శక్తి ఉంటుంది. గంజి నీళ్లు వాడితే చుండ్రు తగ్గిపోయే అవకాశం ఉంది. 18 రకాల అమినో ఆమ్లాలతో తయారైన కెరాటిన్ అనే ప్రొటీన్ వెంట్రుకల్లో ఉంటుంది. బియ్యం నీళ్లలో వీటిలోని ఎనిమిది అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టు రాలిపోవడాన్ని సహజ పద్ధతుల్లో నివారిస్తాయి. ప్రొటీన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు బి, సి, ఇ విటమిన్లు ఉంటాయి. బి విటమిన్ కురులను దృఢంగా చేస్తుంది. సి విటమిన్ మాడుకు తేమను అందించే సెబం ఉత్పత్తిని పెంచుతుంది. ఇ విటమిన్ వెంట్రుకలు రాలడాన్ని తగ్గిస్తుంది.

బియ్యం నీళ్లలోని అమినో ఆమ్లాలు కురులు పెరగడంలో, వాటిని బలంగా మార్చడంలో సాయపడతాయి. వెంట్రుకల చివర్లు చిట్లిపోవడం తగ్గుతుంది. క్రమం తప్పకుండా బియ్యం నీళ్లతో కేశాలను శుభ్రం చేసుకుంటే, తలభాగంలో పీహెచ్ ఒకేస్థాయిలో ఉంటుంది. శిరోజాలు సాగేగుణాన్ని పొందడమే కాదు ఆరోగ్యంగా మారతాయి. పులియబెట్టిన బియ్యం నీళ్లలో విటిమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది దెబ్బతిన్న, నిర్జీవమైన జట్టును సున్నితంగా, పట్టులా మెరిసేలా చేస్తుంది. బియ్యం నీళ్లలోని అయనోసిటాల్ అనే కార్బోహైడ్రేట్ కురులకు రంగు, స్టయిల్‌ను ఇస్తుంది.

గమనిక :– అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Read Also..  Health Tips: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మధుమేహం కావొచ్చు.. ముందుగానే జాగ్రత్త పడండి..