AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మధుమేహం కావొచ్చు.. ముందుగానే జాగ్రత్త పడండి..

మధుమేహం.. ఈ రోజుల్లో ఒక సాధారణ వ్యాధిగా మారిపోయింది. టీనేజర్లు, యువత, వృద్ధులు.. ఇలా అన్ని వయస్కులవారు ఈ రోగంతో బాధపడుతున్నారు.

Health Tips: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మధుమేహం కావొచ్చు.. ముందుగానే జాగ్రత్త పడండి..
Basha Shek
| Edited By: Ravi Kiran|

Updated on: Feb 22, 2022 | 8:45 AM

Share

మధుమేహం.. ఈ రోజుల్లో ఒక సాధారణ వ్యాధిగా మారిపోయింది. టీనేజర్లు, యువత, వృద్ధులు.. ఇలా అన్ని వయస్కులవారు ఈ రోగంతో బాధపడుతున్నారు. జన్యుపరమైన కారణాలు, అనారోగ్యకరమైన జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం…ఇలా ఎన్నో కారణాలు మనల్ని మధుమేహ (Diabetes) బాధితులుగా మారుస్తున్నాయి. ఆహార నియమాలు, ఇతర జాగ్రత్తలు తీసుకుని డయాబెటిస్‌ను అదుపులో పెట్టుకోవాలి తప్ప.. శాశ్వతంగా తొలగించడం సాధ్యం కాదు. మరో దురదృష్టకరమైన విషయమేమిటంటే.. డయాబెటిస్‌ బాధితుల్లో చాలామందికి ఈ వ్యాధి ఉందన్న విషయం కూడా తెలియడం లేదు. కొన్ని నివేదికల ప్రకారం, 90 శాతం డయాబెటిస్‌ కేసుల్లో వ్యాధి ముదిరిన తర్వాతే బయటపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే మన శరీరంలో కొన్ని మార్పులు, లక్షణాలను పసిగట్టడం ద్వారా ముందస్తుగా జాగ్రత్తపడవచ్చు. సకాలంలో చికిత్స తీసుకుని డయాబెటిస్‌ మరింత ముదరకుండా నివారించవచ్చు. మరి ఆ లక్షణాలేంటో ఒకసారి తెలుసుకుందాం రండి.

దురద

కాళ్లు, చేతులు, వెన్నుభాగంలో నిరంతరం దురద పెడుతుంటే అవి ముందస్తు డయాబెటిస్‌ లక్షణాలు కావొచ్చు. ముఖ్యంగా టీజేజర్లు, యువతలో ఈ లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మేలు. ఒక వేళ చికిత్స తీసుకున్నప్పటికీ సమస్య నయం కాకపోతే తప్పకుండా మధుమేహం నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.

జుట్టు రాలిపోవడం

ప్రస్తుత పరిస్థితుల్లో జుట్టు రాలడమనేది సాధారణ విషయం. పోషకాహార లోపం, కాలుష్యం, అనారోగ్యకరమైన జీవనశైలి ఇలా జుట్టు రాలిపోవడానికి ఎన్నో కారణాలున్నాయి. అయితే విపరీతమైన హెయిర్‌ పాల్‌ డయాబెటిస్‌ ముందస్తు లక్షణం కూడా కావొచ్చని నిపుణులు అంటున్నారు.

తరచుగా మూత్ర విసర్జన

మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా మూత్రవిసర్జనకు వెళుతుంటారు. అయితే డయాబెటిస్‌ ఉందన్న విషయం తెలియక చాలామంది ఈ పరిస్థితిని తేలికగా తీసుకుంటారు. ఈ సమస్య చాలారోజుల పాటు ఉంటే వెంటనే మధుమేహం నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలంటున్నారు నిపుణులు.

గురక

అనారోగ్యకరమైన జీవనశైలి, శారీరక శ్రమ పెరగడం, ఒత్తిడి.. ఇలా గురకకు ఎన్నో కారణాలున్నాయి. అయితే ఇది కూడా మధుమేహం లక్షణం కావొచ్చు. గురక పెట్టే వ్యక్తి ప్రశాంతంగానే నిద్రపోతాడు, కానీ ఇతరులకు బాగా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి గురక సమస్యతో ఇబ్బంది పడుతుంటే, కచ్చితంగా డయాబెటిస్ చెకప్ చేయించుకోవడం మేలు.

గొంతు లేదా చంకల్లో నల్లటి ప్యాచెస్

గొంతు లేదా చంకల్లో నల్లటి ప్యాచెస్ ఏర్పడుతాయి. వీటిని చేతితో తాకినప్పుడు వెల్వెట్ మాదిరిగా అనిపిస్తాయి. ఇవి మధుమేహం రావడానికి ముందు లక్షణాలని గుర్తించాలి. ఈ లక్షణం కనిపించింది అంటే మీ రక్తంలో ఇన్సులిన్ పెరిగినట్లు సంకేతాలే.

చర్మంపై మచ్చలు

చర్మంపై దురద లేదా నొప్పి లేదా చర్మంపై పెరిగిన మొటిమలు ఏర్పడతాయి. తర్వాత మొల్లమెల్లగా పసుపు, ఎరుపు లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి కూడా మధుమేహానికి ముందస్తు లక్షణాలేనని గుర్తించాలి. దీని కోసం షుగర్ చెక్ చేసుకోవడం ఎంతో అవసరం. ఇలా గుర్తించిన వెంటనే చర్మ వైద్యుడిని సంప్రదించి తగు సలహాలు కూడా తీసుకోవాలి.

నయంకాని గాయాలు

ఒక వ్యక్తి రక్తంలో చక్కెరల స్థాయి చాలా కాలం పాటు ఎక్కువగా ఉన్నట్లయితే.. నరాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రక్త ప్రసరణలో సమస్యలు కూడా వస్తాయి. నరాలు దెబ్బతినడం వల్ల చర్మంపై ఏదైనా గాయమైతే త్వరగా నయం కాదు. ఇలాంటి సమస్య కనిపించగానే వెంటనే వైద్యున్ని సంప్రదించడం బెటర్‌.

Also Read:Big News Big Debate: సౌత్‌ టు నార్త్‌ జర్నీ రోడ్‌మ్యాప్‌ రెడీ అయిందా? కేసీఆర్‌తో కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలేంటి?

Vijay Deverakonda: రష్మికతో ప్రేమ, పెళ్లి వార్తలపై తన మార్క్ ట్వీట్ వేసిన రౌడీ హీరో.. ఫుల్ క్లారిటీ

viral video: ధైర్యం అంటే ఇదే కదా! బాతు భీకర పోరు..