- Telugu News Photo Gallery These less than 100 calories foods can keep you healthy make them part of your diet Healthy Foods Telugu
Healthy Foods: ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా..? అయితే 100 కంటే తక్కువ కేలరీల ఆహారాన్ని తీసుకోండి..
100 calories foods: శరీరంలో ఎక్కువ క్యాలరీలు ఉంటే ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతుంటాయి. అందుకే ఎక్కువ కేలరీల ఆహారానికి దూరంగా ఉండాలని సూచిస్తుంటారు. అందుకే మీరు తినాలన్న, తాగలన్న ఒక్కసారి ఆలోచించడం ముఖ్యం. ఇప్పుడు అలాంటి ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. వీటిలో 100 కంటే తక్కువగా కేలరీలు మాత్రమే ఉంటాయి.
Updated on: Feb 22, 2022 | 1:47 PM

క్యాప్సికమ్: ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయోజనకరంగా భావించే క్యాప్సికమ్‌లో 24 గ్రాముల కేలరీలు మాత్రమే ఉంటాయి. వైద్యులు, నిపుణులు కూడా ఇవే తినమని సిఫార్సు చేస్తుంటారు. అయితే ఇది కూడా పరిమిత పరిమాణంలో తినాలి.

స్ట్రాబెర్రీ: ఇది ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. నివేదికల ప్రకారం.. ఒక కప్పు స్ట్రాబెర్రీలో దాదాపు 54 కేలరీలు ఉంటాయి. విశేషమేమిటంటే.. దీని రుచి కారణంగా పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు.

కీరదోస: కీర దోసకాయ శరీరంలోని నీటి కొరతను నివారించి హైడ్రేట్‌గా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులో దాదాపు 24 గ్రాముల కేలరీలు ఉంటాయి. దీనివల్ల ఆరోగ్యంతోపాటు చర్మం, జుట్టు సమస్యలను కూడా దూరం చేస్తుంది.

బ్రొకోలీ: ఆరోగ్యకరమైన ఆహారాల విషయానికి వస్తే.. బ్రోకొలీని మంచి ఎంపిక. నివేదికల ప్రకారం, విటమిన్లు, ఖనిజాలతో కూడుకున్న ఒక కప్పు బ్రోకొలీలో దాదాపు 54 గ్రాముల కేలరీలు ఉంటాయి. మీరు దీన్ని సలాడ్ లేదా కూరగాయల రూపంలో తినవచ్చు.

యాపిల్: యాపిల్‌లో తక్కువ క్యాలరీలు ఉంటాయి. జిమ్ లేదా వ్యాయామం చేసే వారు తప్పనిసరిగా ఈ పండును రోజుకు ఒకటి తినడం మంచిది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది పిల్లల నుంచి వృద్ధుల వరకు ఉపయోగకరంగా ఉంటుంది.




