viral video: ధైర్యం అంటే ఇదే కదా! బాతు భీకర పోరు..
అనుకోని విపత్తు ఎదురైనప్పుడు దానిని ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రమాదంలో చిక్కుకున్న ఉదంతాలు కోకొల్లలు. ఐతే ధైర్యం, పట్టుదల, తెగువ, సమయస్ఫూర్తి ఉంటే ఎంతటి విపత్తునైనా అలవోకగా జయించవచ్చని పెద్దలు చెబుతుంటారు. కానీ..
A Duck Had A Stand-Off With Cows: అనుకోని విపత్తు ఎదురైనప్పుడు దానిని ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రమాదంలో చిక్కుకున్న ఉదంతాలు కోకొల్లలు. ఐతే ధైర్యం, పట్టుదల, తెగువ, సమయస్ఫూర్తి ఉంటే ఎంతటి విపత్తునైనా అలవోకగా జయించవచ్చని పెద్దలు చెబుతుంటారు. కానీ అది కొందరికే సాధ్యమౌతుంది. మనుషులకు కూడా సాధ్యపడని రీతిలో ఓ పక్షి తనను తాను కాపాడుకోవడానికి చేసిన పని ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోమవారం (ఫిబ్రవరి 21) సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. సైజు ఎంతుంటేనేం.. ధైర్యం ఉంటే చాలు అని, ఈ వీడియో తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. అసలేం జరిగిందంటే..
చుట్టూ ఆవుల మంద.. మధ్యలో ఓ బాతు. అవునండీ.. ఒకే ఒకబాతు తనపై దాడి చేయడానికొస్తున్న ఆవులను భయపెట్టడానికి తన సాయశక్తులా ప్రయత్నించడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఒక పొలంలో ఉన్న ఆవుల మందతో ఒంటరిగా, కేవలం తన శక్తినే నమ్ముకుని చేస్తున్న బాతు పోరాడటం.. చూసేవారికి జీవిత సత్యాన్ని బోధిస్తోంది. తన కంటే ఎన్నో రెట్లు పెద్దవైన ఆవులతో పోరాడుతున్న విధానం ప్రతి ఒక్కరినీ ముక్కు మీద వేలేసుకునేలా చేస్తోంది. మీరు ఓ లుక్కేయండి..
‘How’s the Josh, bird?’ ‘High sir, Ultra high’. That bird’s chutzpah is my #MondayMotivation (courtesy @ErikSolheim ) pic.twitter.com/lVDRXpDZbp
— anand mahindra (@anandmahindra) February 21, 2022
Also Read: