HPCL Jobs: బీటెక్ చేశారా? నేరుగా ఇంటర్వ్యూతోనే.. హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు..
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) కు చెందిన రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్.. ఎగ్జిక్యూటివ్ పోస్టుల (Executive posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
HPCL Rajasthan Recruitment 2022: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) కు చెందిన రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్.. ఎగ్జిక్యూటివ్ పోస్టుల (Executive posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 46
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, హెచ్‌ఆర్, సీఏ, లా, మెకానికల్, మెకానికల్ – పెట్రోకెమికల్.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 42 నుంచి 46 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్:
- మేనేజర్ పోస్టులకు సంవత్సరానికి రూ.20.83లక్షలు
- సీనియర్ మేనేజర్ పోస్టుకు సంవత్సరానికి రూ. 23.44 లక్షలు
అర్హతలు: పోస్టును బట్టి సంబందిత స్పెసలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో నాలుగేళ్ల ఇంజనీరింగ్ డిగ్రీ/మెకానికల్/ఎలక్ట్రికల్/సివిల్/కెమికల్ ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ అవసరం.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 24, 2022.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 15, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: