SIDBI Jobs: స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..
SIDBI Recruitment: స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. లక్నో ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ కాంట్రాక్ట్ విధానంలో ఖాళీలను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
SIDBI Recruitment: స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. లక్నో ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ కాంట్రాక్ట్ విధానంలో ఖాళీలను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 18 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* జూనియర్ కన్సల్టెంట్లు–ఇంజనీరింగ్(సివిల్, మెకానికల్) 02, అడిట్ కన్సల్టెంట్ (04), జూనియర్ అడిట్ కన్సల్టెంట్లు (04), కంపెనీ సెక్రటరీ (01), యంగ్ ప్రొఫెషనల్ (02), ఫండ్ మేనేజర్ (01), లీడ్ స్పెషలిస్ట్ (02), హెచ్‌ఆర్ అసోసియేట్ (02) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్, ఎంబీఏ/పీజీడీబీఎం,సీఏ ఉత్తీర్ణులవ్వాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం, టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
* అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ మెయిల్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* తమ పూర్తివివరాలను recruitment@sidbi.in మెయిల్ ఐడీకి పంపించాలి.
* అభ్యర్థులను ముందుగా విద్యార్హత, పని ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు 28-02-2021 చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Amit Shah: హిజాబ్ వివాదంపై పెదవి విప్పిన అమిత్ షా.. ఏమన్నారంటే..
Hyderabad Water Supply: హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం..
Hyderabad Water Supply: హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం..