Amit Shah: హిజాబ్ వివాదంపై పెదవి విప్పిన అమిత్ షా.. ఏమన్నారంటే..
Karnataka Hijab Row: కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. ఈ వివాదం కారణంగా కర్ణాటక (Karnataka)లో మూతపడిన కళాశాలలు, విద్యా సంస్థలు ఇంకా తెరచుకోలేదు.
Karnataka Hijab Row: కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. ఈ వివాదం కారణంగా కర్ణాటక (Karnataka)లో మూతపడిన కళాశాలలు, విద్యా సంస్థలు ఇంకా తెరచుకోలేదు. మరోవైపు కర్ణాటక హైకోర్టులో హిజాబ్ పై విచారణ కొనసాగుతుండగానే దేశంలోని పలు ప్రాంతాల్లోనూ హిజాబ్ లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో బీజేపీపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit shah) స్పందించారు. విద్యార్థులు మతపరమైన దుస్తులు ధరించడం కంటే యూనిఫాం ధరించి మాత్రమే వెళితే మంచిదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘పాఠశాలలకు వచ్చే విద్యార్థులు మతపరమైన దుస్తులు ధరించడం కంటే యూనిఫాం ధరించి స్కూలుకు రావడానికే నేను మద్దతిస్తాను. దేశంలోని అన్ని మతాల వారు స్కూలు యూనిఫాంలను అంగీకరించాల్సిందే. అయితే ఇది నా వ్యక్తిగత నిర్ణయం మాత్రమే. ఒకవేళ న్యాయస్థానం గనక తీర్పు వెలువరించాక నా నిర్ణయంలో ఏమైనా మార్పు రావొచ్చు. కోర్టు తీర్పులను ఎవరైనా గౌరవించాల్సిందే. దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తుందా? లేదంటే ఇష్టానుసారం నడుస్తుందా’ అనేది మనమే నిర్ణయించుకోవాలి’ అని అమిత్‌షా తెలిపారు. కాగా హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో వాడివేడిగా వాదనలు కొనసాగుతున్నాయి. కాగా విద్యార్థులు హిజాబ్ ధరించి రావడం నిషేధంపై కర్ణాటక ప్రభుత్వం గట్టిగా తన చర్యలను సమర్థించుకుంటోంది.
Also Read:Lalu Prasad Yadav: అస్వస్థతకు గురైన ఆర్జేడీ అధినేత లాలూ.. ఆస్పత్రిలో చికిత్స..