Gold Silver Price Today: గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?

Latest Gold Silver Prices: బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతూ షాకిస్తున్నాయి. వాస్తవానికి పసిడి, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయి.

Gold Silver Price Today: గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?
Gold Silver Price
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 22, 2022 | 6:26 AM

Latest Gold Silver Prices: బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతూ షాకిస్తున్నాయి. వాస్తవానికి పసిడి, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. కాగా.. తాజాగా మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం బంగారం) ధర మార్కెట్లో రూ.45,900 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,050 గా ఉంది. 22 క్యారెట్ల తులం బంగారంపై (Gold Price) రూ. 90 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.130 మేర తగ్గింది. కాగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి (Silver Rate) ధర రూ. 64,000 గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా (Gold, silver prices today) ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,990 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,050 లుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,050, చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,270, 24 క్యారెట్ల ధర రూ.51,570 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,050 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,050 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,050 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,050 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,050 గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.64,000 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.64,000 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.68,200 ఉంది. బెంగళూరులో రూ.70,000, కేరళలో రూ.70,000 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.70,000, విజయవాడలో రూ.70,000, విశాఖపట్నంలో రూ.70,000 ఉంది.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:

Goutham Reddy Death Live Updates: పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి సీఎం జగన్ నివాళులు

PM Narendra Modi: అలా అస్సలు చేయొద్దు.. బీజేపీ నేతకు వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోదీ.. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి..

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం