TS Govt Jobs: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 10 వేల పోస్టుల భర్తీ..
Telangana Govt Jobs: తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త రానున్నట్లు తెలుస్తోంది. సంక్షేమ గురుకుల సొసైటీల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయాలని ప్రభుత్వం చేయడంతో పోస్టుల భర్తీకి మార్గం సుగుమైంది..
Telangana Govt Jobs: తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త రానున్నట్లు తెలుస్తోంది. సంక్షేమ గురుకుల సొసైటీల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయాలని ప్రభుత్వం చేయడంతో పోస్టుల భర్తీకి మార్గం సుగుమైంది. దీంతో గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో సుమారు 10 వేల పోస్టులు భర్తీ అయ్యే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే నూతన జోనల్ విధానంపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు రాకపోయినప్పటికీ.. కొత్తగా గుర్తించిన పోస్టులతో పాటు గతంలో మంజూరైన వాటి భర్తీకి నూతన జోనల్ విధానం మేరకు అనుమతుల కోసం ప్రభుత్వానికి సొసైటీలు ప్రతిపాదనలు పంపించాయి.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం 970 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో అడ్మినిస్ట్రేటివ్ పోస్టులతో పాటు ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో అదనంగా గుర్తించిన బోధన సిబ్బంది పోస్టులన్నీ కలిపి పది వేలకుపైగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీటి భర్తీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది కార్యరూపం దాల్చితే పోలీస్ శాఖ తర్వాత అత్యధిక పోస్టులు గురుకులాల్లోనే ఉండనున్నాయని సమాచారం. మరి ఈ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
Also Read: Kajal Aggarwal: వేడుకగా కాజల్ సీమంతం.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటోలు..
KGF 2: కేజీఎఫ్ 2 విడుదల తేదీ వాయిదా పడనుందా..? క్లారిటీ ఇచ్చేసిన చిత్ర యూనిట్..