International Travel: విదేశీ ప్రయాణీకులకు శుభవార్త.. ఈ వారం దానిపై నిర్ణయం తీసుకోనున్న కేంద్ర ప్రభుత్వం
International Travel: కరోనా కారణంగా చాలా మంది తమ ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. కానీ.. మార్చి 1 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ఈ వారంలో కేంద్ర ప్రభుత్వం..
International Travel: కరోనా కారణంగా చాలా మంది తమ ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. కానీ.. మార్చి 1 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ఈ వారంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సాధారణ అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని ఎత్తివేయడానికి హోం వ్యవహారాలు, ఆరోగ్య కుటుంబ సంక్షేమం, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలు అలాగే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌ల అధికారులతో కూడిన అంతర్-మంత్రిత్వ కమిటీ ఈ వారం సమావేశం కానుంది.
ఈ సమావేశం కొవిడ్-19 పరిస్థితిని సదరు కమిటీ పరిగణనలోకి తీసుకుంటుంది. షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ వాణిజ్య విమానాలను మార్చి 1 నుంచి తిరిగి ప్రారంభించేందుకు ఉన్న అవాకాశాలను పరిశీలిస్తుంది. నిషేధాన్ని ఎత్తివేయాలని డీజీసీఏ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రతిపాదించింది. దీనిపై ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి తుది ఆమోదం రావలసి ఉంది.
ఇవీ చదవండి..
IRCTC: రైలు ప్రయాణికులకు శుభవార్త.. అలా టిక్కెట్లను బుక్ చేసుకోండి.. బహుమతులు పొందండి..
Covid 19: దిగివస్తున్న కరోనా మహమ్మారి.. సాధారణ స్థితికి అయా దేశాలు.. ఆంక్షలు సడలించడంపై WHO ఆందోళన