Covid 19: దిగివస్తున్న కరోనా మహమ్మారి.. సాధారణ స్థితికి అయా దేశాలు.. ఆంక్షలు సడలించడంపై WHO ఆందోళన

చాలా దేశాల్లో కొవిడ్ భయం క్రమంగా తగ్గుతోంది. దీంతో ఆంక్షలు సడలిస్తున్నాయి ఆయా దేశాలు. అయితే, దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పుడప్పుడే మహమ్మారి పీడ వదలేదంటోంది.

Covid 19: దిగివస్తున్న కరోనా మహమ్మారి.. సాధారణ స్థితికి అయా దేశాలు..  ఆంక్షలు సడలించడంపై WHO ఆందోళన
Covid 19
Follow us

|

Updated on: Feb 22, 2022 | 6:57 AM

WHO on Covid-19 Curbs: చాలా దేశాల్లో కొవిడ్(Covid-19) భయం క్రమంగా తగ్గుతోంది. దీంతో ఆంక్షలు సడలిస్తున్నాయి ఆయా దేశాలు. అయితే, దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పుడప్పుడే మహమ్మారి పీడ వదలేదంటోంది. మరి కొద్దిరోజులు అప్రమత్తత అవసరమంటోంది. కరోనా వైరస్(Coronavirus) వెలుగులోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విజృంభించింది. కోట్లాది మంది విలవిలలాడగా, లక్షలాది మందిని పొట్టనబెట్టుకుంది మహమ్మారి. ఆ తర్వాత, అనేక వేరియంట్లు, వేవ్‌లతో అల్లకల్లోలం సృష్టించింది వైరస్. అయితే, ఈ విపత్కర పరిస్థితులు చాలా వరకు నెమ్మదించాయి. దీంతో ప్రపంచ దేశాలు తిరిగి సాధారణ పరిస్థితులకు మళ్లుతున్నాయి. ఆంక్షలను ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.

కొవిడ్ పేరిట విధించిన అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేయాలన్నది ఆలోచిస్తోంది బ్రిటన్ సర్కారు. కరోనాతో కలసి జీవించే విధానాన్ని రూపొందించింది. దీన్ని పార్లమెంటు ముందు ఉంచనున్నారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. కరోనా మహమ్మారి గుప్పిట నుంచి బయటపడి ఆర్థికంగా పుంజుకోవాలన్న ప్రణాళికతో పనిచేస్తోంది బోరిస్ జాన్సన్ సర్కారు. అటు ఆస్ట్రేలియా అంతర్జాతీయ ప్రయాణికులకు ద్వారాలు తెరిచింది. అమెరికాలో కొత్త కేసుల నమోదు, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. కరోనా టీకాలు తీసుకోకపోయినా పర్యాటకులకు ఆహ్వానం పలికింది ఇజ్రాయెల్. ఏప్రిల్ నుంచి భారత్ కూడా పూర్తి స్థాయి అంతర్జాతీయ విమాన సర్వీసులను అనుమతించనుంది. మన దేశంలోనూ రోజువారీ కరోనా కేసులు 16 వేలకు పడిపోవడంతో, కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, దేశాల నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రస్తుత పరిస్థితులు మరింత వ్యాప్తి చెందే, ప్రమాదకరమైన కరోనా వేరియంట్లకు వీలు కల్పిస్తాయని హెచ్చరించారు WHO చీఫ్ టెడ్రోస్. ఆంక్షలను సడలించొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. అయితే, కేసులు తగ్గడం, టీకాలు వేసుకోవడంతో ధైర్యం చేస్తున్నారు దేశాలు.

Read Also…  Corbevax Vaccine: కరోనాపై పోరులో మరో ముందడుగు.. పిల్లల కోసం అందుబాటులోకి మరో కొవిడ్‌ టీకా..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..