Kajal Aggarwal: వేడుకగా కాజల్ సీమంతం.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటోలు..
పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) అమ్మగా త్వరలోనే నూతన ప్రయాణం ప్రారంభించనుంది. భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి మూడో వ్యక్తిని తమ జీవితంలోకి ఆహ్వానించేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తోంది.
పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) అమ్మగా త్వరలోనే నూతన ప్రయాణం ప్రారంభించనుంది. భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి మూడో వ్యక్తిని తమ జీవితంలోకి ఆహ్వానించేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె సోషల్ మీడియా (SocialMedia) ద్వారా అభిమానులతో అందుబాటులో ఉంటోంది. తన బేబీ బంప్ ఫొటోలు, వీడియోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటోంది. ఇవి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా కాజల్ సీమంతం (బేబీషవర్) వేడుకలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొన్నారు. కాగా తన బేబీషవర్ ఫంక్షన్ ఫొటోలను కాజలే స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో అవి కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
డెలివరీ ఎప్పుడంటే..
కాగా ఈ ఫొటోల్లో ఎరుపు రంగు చీరలో అందంగా ముస్తాబైంది కాజల్. ఆమె భర్త గౌతమ్ కుర్తా పైజామాతో తళుక్కుమన్నాడు. కాజల్ సోదరి నిషాఅగర్వాల్ కూడా ఈ వేడుకల్లో పాల్గొంది. కాగా ఇందులో ఓ ఫొటోలో ‘మమ్మీ కమింగ్ సూన్ మే, 2022’ అని రాసుంది. అంటే మే నెలలోనే కాజల్ తల్లిగా ప్రమోషన్ పొందనుందని తెలుస్తోంది. గర్భం దాల్చడంతో ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. కొత్త చిత్రాలేవీ కూడా అంగీకరించడం లేదు. ప్రెగ్నెన్సీ కారణంగానే అక్కినేని నాగార్జునతో చేయాల్సిన ఘోస్ట్ సినిమా నుంచి కూడా తప్పుకుంది. ఇక మెగాస్టార్ చిరంజీవితో నటించిన ఆచార్య సినిమాను ముందే పూర్తి చేసింది. ఇది ఏప్రిల్ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇటీవల కాజల్, దుల్కర్ సల్మాన్ జంటగా నటించిన హే సినామిక సినిమా ట్రైలర్ విడుదలైంది. బృందా మాస్టర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం మార్చి 3న థియేటర్లలో విడుదల కానుంది. కాగా ఈ సినిమాలు తప్పితే కాజల్ మరో ఏడాది పాటు నటనకు దూరంగానే ఉండేలా కనిపిస్తోంది.
View this post on Instagram
Also Read:Lalu Prasad Yadav: అస్వస్థతకు గురైన ఆర్జేడీ అధినేత లాలూ.. ఆస్పత్రిలో చికిత్స..
viral video: ధైర్యం అంటే ఇదే కదా! బాతు భీకర పోరు..
ఇంటర్వ్యూలో యువతి చేసిన పనికి బాస్ షాక్ !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో