Puri Jagannadh: ఫిలిమ్ మేకింగ్‌లో పూరి మరో ముందడుగు.. ఈసారి ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో..
Puri Jagannadh: పూరి జగన్నాథ్ టాలీవుడ్ ప్రేక్షకులకు ఈపేరు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మాస్ ప్రేక్షకుల పల్స్ పట్టుకున్న ఈ క్రేజీ డైరెక్టర్ ఎన్నో ఇండస్ట్రీ హిట్స్‌ను సొంతం చేసుకున్నాడు. అంతేనా...
Puri Jagannadh: పూరి జగన్నాథ్ టాలీవుడ్ ప్రేక్షకులకు ఈపేరు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మాస్ ప్రేక్షకుల పల్స్ పట్టుకున్న ఈ క్రేజీ డైరెక్టర్ ఎన్నో ఇండస్ట్రీ హిట్స్‌ను సొంతం చేసుకున్నాడు. అంతేనా ఎంతో మంది హీరోలకు తమ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌ను అందించిన సత్తా పూరి సొంతం. పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండంతో లైగర్ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ఇదిలా ఉంటే పూరి తన చిత్రాన్ని కూడా విజయ్‌తోనే తెరకెక్కించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం విధితమే. ఇది పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ అని సమాచారం.
ఇదిలా ఉంటే పూరి తన తర్వాతి ప్రాజెక్ట్‌పై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ‘లైగర్’తో పాన్ ఇండియా దర్శకుడిగా మారిన పూరి. ఈసారి అంతర్జాతీయ సినిమాపై దృష్టిసారించారు. ఇందులో భాగంగానే తన తర్వాతి చిత్రాన్ని పూరి కనెక్ట్స్ నిర్మాణంలో ప్లాన్ చేస్తున్న పూరి.. అంతర్జాతీయ ప్రాజెక్ట్‌గా పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
అయితే ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారు.? అసలు సినిమా కథ ఏంటి.? అన్న విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఇప్పటికే బాహుబలి, పుష్పతో జాతీయ స్థాయిలో మారుమోగుతోన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌పై కన్నేసినట్లు కనిపిస్తోంది కదూ.! మరి పూరి కొత్త ప్రయోగం సక్సెస్ అవుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Also Read: viral video: ధైర్యం అంటే ఇదే కదా! బాతు భీకర పోరు..