Hyderabad Water Supply: హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొన్ని ప్రాంతాలలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్(KDWSP) ఫేజ్ -3కి
గ్రేటర్ హైదరాబాద్(GHMC) పరిధిలోని కొన్ని ప్రాంతాలలో నీటి సరఫరాలో(water supply) అంతరాయం ఏర్పడనుంది. హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్(KDWSP) ఫేజ్ -3కి సంబంధించిన 2375 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ హెడర్ పైప్‌కు వాటర్ లీకేజీలు నివారించేందుకు గానూ మరమ్మత్తు పనులను జలమండలి చేపట్టనుంది. అలాగే, కోదండాపూర్ పంపింగ్ స్టేషన్ పంప్ హౌజ్ వద్ద పలు మరమ్మత్తులు జరపనుంది. పైపులైనుకు జంక్షన్ పనులు చేపడుతున్న కారణంగా 23.02.2022( బుధవారం) ఉదయం 5 గంటల నుంచి మరుసటి రోజు 24.02.2022 (గురువారం) సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు ఈ మరమ్మత్తు ప్రక్రియ కొనసాగుతాయి. ఈ క్రమంలో 36 గంటల వరకు కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ – 3 కింద ఉన్న రిజర్వాయర్ల పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
1. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 1 – శాస్త్రీపురం. 2. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 2 – బండ్లగూడ. 3. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 3 – భోజగుట్ట, చింతల్‌బస్తీ, షేక్‌పేట్. 4. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 4 – అల్లబండ. 5. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 6 – జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, ప్రశాసన్‌నగర్, తట్టిఖానా. 6. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 7 – లాలాపేట(కొంత భాగం). 7. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 10 – సాహేబ్‌నగర్, ఆటోనగర్, సరూర్‌నగర్, వాసవి రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు. 8. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 13 – సైనిక్‌పురి, మౌలాలి. 9. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 14 – స్నేహపురి, కైలాస్‌గిరి, దేవేంద్రనగర్. 10. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 15 – గచ్చిబౌలి, మాధాపూర్, అయ్యప్ప సొసైటీ, కావురి హిల్స్. 11. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 16 – మధుబన్, దుర్గానగర్, బుద్వేల్, సులేమానగర్, గోల్డెన్ హైట్స్, 9 నెంబర్. 12. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 18 – కిస్మత్‌పూర్, గంధంగూడ. 13. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 19 – బోడుప్పల్, మల్లిఖార్జుననగర్, మాణిక్‌చంద్, చెంగిచర్ల, భరత్‌నగర్, పీర్జాదిగూడ. 14. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 20 – ధర్మసాయి.
కావున నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరడమైనది.
ఇవి కూడా చదవండి: Gold Rate Today: తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్న బంగారం.. ఎప్పటి వరకు తగ్గొచ్చంటే..