AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మురుగు గుంతలో పడిపోయిన ఏనుగు.. ఆర్కిమెడిస్‌ సిద్ధాంతంతో పైకి.. అధికారుల ఐడియాకు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే..

సాధారణంగా జంతువులు కాలువల్లో, గుంతల్లో పడిపోతే తాళ్ల సాయంతో లేకపోతే మరో విధంగానో కాపాడడం మనం చూస్తుంటాం. కానీ కోల్‌కతా (Kolkata) లోని అటవీ అధికారులు తమ బుర్రకు పదును పెట్టారు.

Viral Video: మురుగు గుంతలో పడిపోయిన ఏనుగు.. ఆర్కిమెడిస్‌ సిద్ధాంతంతో పైకి.. అధికారుల ఐడియాకు హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే..
Basha Shek
| Edited By: Ravi Kiran|

Updated on: Feb 22, 2022 | 9:15 AM

Share

సాధారణంగా జంతువులు కాలువల్లో, గుంతల్లో పడిపోతే తాళ్ల సాయంతో లేకపోతే మరో విధంగానో కాపాడడం మనం చూస్తుంటాం. కానీ కోల్‌కతా (Kolkata) లోని అటవీ అధికారులు తమ మెదడుకు పదును పెట్టారు. చిన్నప్పుడు ఆర్కిమెడిస్‌ (Archimedes) బోధించిన సూత్రాన్ని అమలుచేసి గోతిలో పడిపోయిన భారీ ఏనుగును రక్షించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ (Midnapur) జిల్లాలోని అటవీప్రాంతంలో ఓ ఏనుగు ప్రమాదవశాత్తూ పెద్ద మురుగు గుంతలో పడిపోయింది. ఈ విషయం సమీపంలోని అటవీ అధికారులకు అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత తెలిసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు గోతిలో పడిపోయిన ఏనుగును పరిశీలించారు. దానిని బయట తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఆ గుంత చాలా లోతుగా ఉండటంతో తీయడం కష్టంగా అనిపించింది. దీంతో తమ మెదడుకు పదును పెట్టిన అటవీ అధికారులు చిన్నప్పుడు తాము చదువుకున్న ఆర్కిమెడిస్‌ సిద్ధాంతాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. వెంటనే తమ ప్లాన్‌ను అమలు చేశారు.

నెటిజన్ల ప్రశంసలు..

ఇందులో భాగంగా అటవీ శాఖ అధికారులు ఏనుగు పడిన గోతిని పైపుల ద్వారా నీటితో నింపారు. దీంతో క్రమంగా ఆ ఏనుగు నీటిపై తేలింది. అనంతరం పెద్ద తాళ్లను ఏనుగు కాళ్ల కిందకు చేర్చి మెల్లగా దానిని పైకి లాగారు. ఇలా సుమారు మూడు గంటలపాటు శ్రమించారు. చివరకు తెల్లవారుజాము 4 గంటలకు ఆ ఏనుగును సురక్షితంగా లోతైన గుంత నుంచి పైకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ తన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ‘అటవీశాఖ అధికారులు ఆర్కిమెడిస్‌ సూత్రం సహాయంతో ఏనుగును కాపాడారు. నా మాటలు నమ్మలేకపోతే ఈ వీడియోను చూడండి’ అని తన వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చారు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతోంది. ఏనుగును కాపాడేందుకు అటవీశాఖ అధికారుల ప్రయత్నాన్ని చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా తెలివిగా ఏనుగును కాపాడారంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: Lalu Prasad Yadav: అస్వస్థతకు గురైన ఆర్జేడీ అధినేత లాలూ.. ఆస్పత్రిలో చికిత్స..

Ottawa: కెనడా రాజధాని ఒట్టావాలో ఆందోళనలు ఉధృతం.. నిరసనకారులపై లాఠీచార్జ్..

డిఫరెంట్‌గా ఫోటోషూట్ ట్రై చేసిన దివి.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్