Viral Video: ప్రేమలో మునిగితేలుతున్న డేగలు.. గాలిలో విహరిస్తూ ఏం చేశాయంటే..? వీడియో
Eagles dance in the air: సోషల్ మీడియా ప్రపంచంలో జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని మనసుకు హత్తుకుంటుంటాయి.
Eagles dance in the air: సోషల్ మీడియా ప్రపంచంలో జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని మనసుకు హత్తుకుంటుంటాయి. తాజాగా డేగ (Eagle) లకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసి అందరూ ఫిదా అవుతున్నారు. డేగలు రెండూ కూడా ప్రేమించుకుంటున్నాయని.. అందుకే అవి రెండూ ప్రకృతిలో విహరిస్తున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి ప్రకృతిలో ప్రతిదీ అందంగా కనిపిస్తుంది. అందుకే దాని అందాన్ని ఆస్వాదించాలని పేర్కొంటుంటారు పెద్దాలు. ఉరుకుపరుగుల జీవితంలో ప్రకృతి అందాన్ని అస్వాదించడం అందరికీ సాధ్యం కాదు. కానీ.. ఒక్క జంతువులకు మాత్రం సాధ్యమవుతుంది. అలాంటి అద్భుతమైన వీడియో సోషల్ మీడియా (social media) లో తాజాగా వైరల్ అయింది.
డేగలు గాలిలో ఎగురుతూ వేటాడిన వీడియోలను కానీ.. ప్రత్యక్షంగా కానీ మీరు చూసే ఉంటారు. అయితే ఈ పక్షి ఎంత ప్రమాదకరమైన జీవినైనా సులువుగా వేటాడుతుంది. ఈ వీడియో చూస్తే.. ఇది మంచి లవర్ కూడా అంటారు. ఎందుకంటే.. ఈ వీడియోలో రెండు డేగలు ఆకాశంలో ఇలా చేయడం మునుపెన్నడూ చూడలేదు. వైరల్ అవుతున్న వీడియోలో.. రెండు డేగలు గాలిలో ఎగురుతుండటాన్ని చూడవచ్చు. కొంచెం ఎత్తుకు చేరుకోగానే ఈ డేగల జంట ఒకదానికొకటి దగ్గరగా వచ్చి.. కాళ్లను జత చేసి తమ ప్రేమను చాటుకుంటూ.. గాలిలో నృత్యం చేసినట్లు విహరిస్తాయి. ఈ క్లిప్ చూసిన తర్వాత నెటిజన్లు ఆహ్లాదకరంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
వైరల్ వీడియో..
Courtship in the Air@ParveenKaswan @susantananda3 pic.twitter.com/IdDPWQzx9p
— Rupin Sharma (@rupin1992) February 19, 2022
ఈ వైరల్ వీడియోను నెటిజన్లు తెగ ఇష్టపడుతున్నారు. చాలా మంది యూజర్లు పలు రకాల కామెంట్లు కూడా చేస్తున్నారు. ఈ డేగలు రెండు ప్రేమలో ఉన్నాయని పేర్కొంటున్నారు.
Also Read: