Glass in Stomach: ఆసుపత్రిలో చేరిన రోగి ఎక్స్‌రే చూసి షాకైన వైద్యులు.. కడుపులో ఏముందంటే..?

Doctors Remove Glass in Stomach: ఓ విచిత్రమైన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన వ్యక్తిని పరిశీలించిన వైద్యులు ఒక్కసారిగా షాకయ్యారు.

Glass in Stomach: ఆసుపత్రిలో చేరిన రోగి ఎక్స్‌రే చూసి షాకైన వైద్యులు.. కడుపులో ఏముందంటే..?
Glass In Stomach
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 22, 2022 | 8:44 AM

Doctors Remove Glass in Stomach: ఓ విచిత్రమైన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన వ్యక్తిని పరిశీలించిన వైద్యులు ఒక్కసారిగా షాకయ్యారు. అతని కడుపులో గ్లాసును (Glass).. గుర్తించి ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 55 ఏళ్ల వ్యక్తికి ఆదివారం బీహార్‌ (Bihar) లోని ముజఫర్‌పూర్‌ మాదిపూర్ లోని ఓ ఆసుపత్రి వైద్యుల బృందం శస్త్రచికిత్స చేసి.. అతని పెద్దప్రేగు నుండి గాజుగ్లాసును వెలికితీసింది. ఈ కేసు గురించి.. డాక్టర్ మఖ్దులుల్ హక్ మాట్లాడుతూ.. ఎండోస్కోపిక్ ద్వారా గ్లాస్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందన్నారు. దీంతో ఆపరేషన్ చేసి గ్లాసును బయటకు తీశామన్నారు. అసలు గ్లాస్ ఆ వ్యక్తి కడుపులోకి ఎలా వెళ్లింది అనేది ప్రశ్నగా మారిందని.. దీనిగురించి బాధితుడు క్లారిటీగా చెప్పడం లేదన్నారు. టీ తాగేటప్పుడు తాను గ్లాస్ మింగేశానని బాధితుడు చెబుతున్నాడని.. ఆహారనాళంలో గ్లాస్ పట్టదని, మలద్వారం నుంచే వెళ్లి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. బాధితుడు వైశాలి జిల్లాలోని మహువాకు చెందినవాడని పేర్కొన్నారు.

బాధితుడు తీవ్రమైన మలబద్ధకం, కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరాడు. అతనికి నిర్వహించిన అల్ట్రాసౌండ్, ఎక్స్-రే పరీక్షల్లో అతని ప్రేగులలో ఏదో ఉన్నట్లు తేలింది. పరిశీలించగా.. గాజు గ్లాసుగా నిర్దారించారు. ఎండోస్కోపిక్ ప్రక్రియ ద్వారా పురీషనాళం నుంచి గాజును బయటకు తీయడానికి మొదట ప్రయత్నించామని డాక్టర్ చెప్పారు. కానీ అది ఫలించలేదని.. ఆ తర్వాత ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

Also Read:

Viral Video: చకా చక్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన వధువు.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు

వేప, రావి చెట్లకు అంగరంగ వైభవంగా వివాహం.. ఆపై విందు భోజనం.. ఎక్కడంటే..

రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పానికి ఎమ్మెల్యేనేః చంద్రబాబు
రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పానికి ఎమ్మెల్యేనేః చంద్రబాబు
సోషల్ మీడియాను మడతపెట్టేస్తున్న మహేష్ బాబు
సోషల్ మీడియాను మడతపెట్టేస్తున్న మహేష్ బాబు
తల్లికాబోతున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
తల్లికాబోతున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
ఇటువంటి కలలు కనిపిస్తే వ్యాధులు, కష్టాలు రానున్నాయని హెచ్చరిక..
ఇటువంటి కలలు కనిపిస్తే వ్యాధులు, కష్టాలు రానున్నాయని హెచ్చరిక..
BSNL కస్టమర్లకు శుభవార్త.. అప్పటి వరకు పూర్తి స్థాయిలో 4G
BSNL కస్టమర్లకు శుభవార్త.. అప్పటి వరకు పూర్తి స్థాయిలో 4G
హనీరోజ్ ఫిర్యాదుతో 27 మందిపై కేసు..
హనీరోజ్ ఫిర్యాదుతో 27 మందిపై కేసు..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ బస్సులు..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ బస్సులు..
డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?