Funny Video: ఏంటి బ్రో ఇలా చేసారు.. కాకులు రాక్.. పిల్లి షాక్.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

మోసం చేయడానికి నిత్యం మన చుట్టూ వందల మంది కాచుకొని ఉంటారు. మనుషులే కాదు జంతువులు కూడా ఇతరజంతువులను మోసం చేస్తూ ఉంటాయి.

Funny Video: ఏంటి బ్రో ఇలా చేసారు.. కాకులు రాక్.. పిల్లి షాక్.. నవ్వులు పూయిస్తున్న వీడియో..
Funny Video
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 22, 2022 | 9:00 AM

Funny Video: మోసం చేయడానికి నిత్యం మన చుట్టూ వందల మంది కాచుకొని ఉంటారు. మనుషులే కాదు జంతువులు కూడా ఇతరజంతువులను మోసం చేస్తూ ఉంటాయి. ఇలాంటి వీడియోలు నెట్టింట చాలా వీడియోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారనడంలో సందేహం లేదు. సోషల్ మీడియాలో ప్రతిరోజూ వేలల్లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని హాస్యాస్పదంగానూ.. మరికొన్ని ఎమోషనల్‌గానూ ఉంటాయి. కానీ మీరు చూసే ఈ వీడియో చాలా అరుదుగా కనిపించేది. ఈ వైరల్ వీడియో పిల్లిని కాకి ఎంతో తెలివిగా మోసం చేసింది. ఆహరం దొంగిలించడానికి ఆ కాకులు చేసిన పని ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తుంది.

ఈ వైరల్ వీడియోలో పిల్లి ఏదో తింటున్నట్లు చూడవచ్చు. దాని దగ్గర రెండు కాకులు తిరుగుతూ ఉండడం కూడా చూడవచ్చు. పిల్లి తింటున్న ఆహారాన్ని దొంగలించాలని ప్లాన్ చేశాయి. ఎదో తింటున్న పిల్లి తోక మీద పొడిచింది ఓ కాకి.    పిల్లికి చిరాకు తెప్పించింది ఆ కాకి.. దాంతో కోపంతో ఉన్న పిల్లి ఆహారాన్ని విడిచిపెట్టి కాకి వెంట పడింది. మరో కాకి అక్కడికి వెళ్లి పిల్లి ఆహారం తీసుకుని ఎగిరిపోయింది. ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ అంగుసామి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ ఫన్నీ వీడియో పంచుకున్నారు.ఈ దశాబ్దంలో ఇదే అతిపెద్ద దొంగతనం అనిఈ వీడియోను షేర్ చేశారు. కేవలం 7 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోకి ఇప్పటివరకు 405.9k పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే 1359కి పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కాకి తెలివిని పొగుడుతూనే కామెంట్స్ చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Video: కూతురిపై ప్రేమతో నాన్న ఇలా చేశాడు..కట్ చేస్తే దెబ్బకు ఫ్యూజులు ఔట్..

Viral Video: పెళ్లి వేడుకలో లొల్లి.. నడి రోడ్డుపై చిత్తుగా కొట్టుకున్న బంధువులు.. నెట్టింట్లో వీడియో వైరల్..

Viral Video: పిచ్చి పీక్స్‌కి వెళ్తే ఇలానే ఉంటుంది… బాక్సులు లేకపోతే బతుకు బస్టాండే..