Viral Video: పిచ్చి పీక్స్‌కి వెళ్తే ఇలానే ఉంటుంది… బాక్సులు లేకపోతే బతుకు బస్టాండే..

ప్రస్తుత కాలంలో మొబైల్‌ లేనిదే రోజు గడవని పరిస్థితి నెలకొంది. చిన్నా, పెద్దా, తేడా లేకుండా మొబైల్‌కి బానిసలైపోతున్నారు. రోడ్డు మీద నడుస్తూ.. వాహనాలు నడుపుతూ కూడా మొబైల్‌ చూడటం ఆపడంలేదు.

Viral Video:  పిచ్చి పీక్స్‌కి వెళ్తే ఇలానే ఉంటుంది... బాక్సులు లేకపోతే బతుకు బస్టాండే..
Viral Video
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 21, 2022 | 3:36 PM

Trending Video: ప్రస్తుత కాలంలో మొబైల్‌ లేనిదే రోజు గడవని పరిస్థితి నెలకొంది. చిన్నా, పెద్దా, తేడా లేకుండా మొబైల్‌కి బానిసలైపోతున్నారు. రోడ్డు మీద నడుస్తూ.. వాహనాలు నడుపుతూ కూడా మొబైల్‌ చూడటం ఆపడంలేదు. ఈ క్రమంలో వాహనంపై వెళ్లేటప్పుడే కాదు… నడుస్తూ మొబైల్ లో మాట్లాడటం, మొబైల్ స్క్రీన్ చూడటం కూడా డేంజరే అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఓ యువకుడు మొబైల్ చూసుకుంటూ గొయ్యిలో పడిపోవడం వైరల్ అయ్యింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా(Social Media)లో ట్రెండ్ అవుతోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలోని ఘటన టర్కీ(Turkey)లోని ఇస్తాంబుల్‌లో జరిగింది. ఓ యువకుడు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయి.. ఫోన్ ధ్యాసలో ఉన్నాడు. మొబైల్ వైపు చూస్తూ నడుస్తున్నాడు. అలా నడుచుకుంటూ అతను ఓ మాల్‌లోకి వెళ్లాడు. అక్కడ మాల్‌ సిబ్బంది పై అంతస్థు నుంచి కింది అంతస్థులోని స్టోరేజీ గదికి ప్యాక్ చేసిన కార్డ్ బోర్డ్ బాక్సుల్ని చేరవేస్తున్నారు. ఇందుకోసం వారు స్టోరేజీ గది సీలింగ్ కి ఉన్న హోల్‌ని తెరిచి ఉంచారు. అటుగా వచ్చేవారంతా అది చూసుకుని.. జాగ్రత్తగా వెళ్తున్నారు.

కానీ ఈ యువకుడు మాత్రం ఫోన్ చూసుకుంటూ అవేమీ పట్టించుకోకుండా వెళ్తూ.. కన్నంలో కాలు పెట్టాడు. అంతే ఒక్కసారిగా కింది అంతస్థులో కార్డ్ బోర్డ్ బాక్సులపై పడ్డాడు. అతడికి ఏం కాకపోవడంతో అక్కడున్నవారు ఊపిరి పీల్చుకున్నారు. అక్కడి సీసీ టీవీలో రికార్డయిన ఈ దృష్యాన్ని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. దాంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ ఘటనలో అతను బాక్సులపై పడ్డాడు కనుక సేఫ్‌గా బటయపడ్డాడు. అదే నేలపై పడి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “ఆ వచ్చే వ్యక్తిని అలర్ట్ చెయ్యాల్సిన బాధ్యత అక్కడున్నవారికి లేదా” అని ఓ యూజర్ ప్రశ్నించగా… “ఫోన్ పిచ్చి మనుషుల్ని చంపేస్తుంది” అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.

Also Read: పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే పాయిజన్ అవుతుందా? ఇదిగో క్లారిటీ

తొక్కే కదా అని తీసిపారేయకండి.. దానితో లెక్కలేనన్ని ప్రయోజనాలు