Viral Video: క్రియేటివిటీ అనుకునేరు.. బురదలో కాలేశారు.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు!
ఈ మధ్యకాలంలో కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకునే జంటలకు ప్రీ-వెడ్డింగ్ షూట్స్‌పై ఆసక్తిని ఎక్కువగా కనబరుస్తున్నారు. క్రియేటివిటీ.. కొంచెం రొమాంటిక్..
ఈ మధ్యకాలంలో కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకునే జంటలకు ప్రీ-వెడ్డింగ్ షూట్స్‌పై ఆసక్తిని ఎక్కువగా కనబరుస్తున్నారు. క్రియేటివిటీ.. కొంచెం రొమాంటిక్.. ఆపై విభిన్న లొకేషన్స్ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే అన్ని సరిగ్గా ఉంటే.. అంతా బాగానే ఉంటుంది. కానీ క్రియేటివిటీ బెడిసికొడితే మాత్రం.. సీన్ రివర్స్ అయిపోతుంది. సరిగ్గా ఇక్కడ అదే సీన్ రిపీట్ అయింది. ఓ జంట విభిన్న లొకేషన్‌లో తమ ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ జరుపుకోవాలని అనుకున్నారు. అక్కడ కాస్త క్రియేటివిటీని ఉపయోగించారు. అంతే.. రచ్చ రంబోలా అయింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం పదండి.!
వైరల్ వీడియో ప్రకారం.. వధూవరులు బురద నీరు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్‌కు పోజులు ఇస్తున్నట్లు మీరు చూడవచ్చు. మొదటి పోజులో వధువును.. వరుడు ఎత్తుకున్నాడు. ఆ తర్వాత ఫోటోగ్రాఫర్.. వరుడును అలాగే ఉండి.. మరో పోజు ఇమ్మన్నట్లు ఉన్నాడు. దానికోసం ప్రయత్నించిన వరుడు.. ఏకంగా వధువుతో కలిసి ముందున్న బురద నీటిలో పడతాడు. ఇలా మొత్తం ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్‌ను బురదతో నింపేసుకున్నారు వదూవరులు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
View this post on Instagram
కాగా, ఈ వీడియోను ‘tube.indian’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ అప్‌లోడ్ చేసింది. ఇప్పటివరకు దీనికి లక్షల్లో వ్యూస్ రాగా.. 46 వేలకు పైగా లైకులు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ చూసేయండి..