Ninja trick: నింజా స్టైల్‌లో దండను విసిరిన మంత్రి.. క్యాచ్ పట్టిన చిన్నారి వైరలవుతున్న వీడియో..

Ninja trick: నింజా స్టైల్‌లో దండను విసిరిన మంత్రి.. క్యాచ్ పట్టిన చిన్నారి వైరలవుతున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Feb 21, 2022 | 1:55 PM

ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి ఓ పాపకు పూలమాలను పర్‌ఫెక్ట్‌గా విసిరిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 50 అడుగుల దూరంలో ఓ పాప ఓ ఇంటి డాబా పై నుంచి ర్యాలీని చూస్తోంది.



ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్రమంత్రి ఓ పాపకు పూలమాలను పర్‌ఫెక్ట్‌గా విసిరిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 50 అడుగుల దూరంలో ఓ పాప ఓ ఇంటి డాబా పై నుంచి ర్యాలీని చూస్తోంది. ఆ పాపను చూసిన మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ దండ కావాలా అని సైగ చేశారు. కావాలని ఆ పాప కోరడంతో… ఆయన దాన్ని నింజా స్టైల్ లో విసిరారు. అంతే ఆ దండ సరిగ్గా పాప దగ్గరకు వెళ్లింది. పాప దాన్ని క్యాచ్ పట్టింది.తన ట్విట్టర్ అకౌంట్లో వీడియో పోస్ట్ చేసిన మంత్రి… “జోష్ ఎలా ఉంది… ఎలా విసిరాను” అని నెటిజన్లను కోరుతూ క్యాప్షన్ ఇచ్చారు. నింజా స్టైల్‌ సూపర్‌ అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. జపాన్ నింజా స్టైల్ ను ఫాలో అయ్యేవారు చాలా వేగంగా స్పందిస్తారు. ఏం చేసినా స్టైలిష్ గా ఉంటుంది. ఇక్కడ మంత్రి కూడా దండను మామూలుగా విసిరితే… బరువు తక్కువగా ఉండటం వల్ల అది కొద్ది దూరం మాత్రమే గాల్లో వెళ్లి కిందపడేది. ఆయన సైడ్ నుంచి పైకి దూసుకెళ్లేలా విసిరడంతో పాపకు చేరింది.

మరిన్ని చూడండి ఇక్కడ: