Shocking Video: వామ్మో ఇదేం ప్రాంక్‌రా నాయనా.. చంపేస్తున్నవ్..! వీడియో చూసి పరేషాన్ అవుతున్న జనం..
Insane Prank Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో ప్రాంక్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. చాలా మంది రాత్రికి రాత్రే.. ట్రేండీగా మారేందుకు ప్రాంక్ వీడియోలను చేయడం పరిపాటిగా మారింది.
Insane Prank Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో ప్రాంక్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. చాలా మంది రాత్రికి రాత్రే.. ట్రేండీగా మారేందుకు ప్రాంక్ వీడియోలను చేయడం పరిపాటిగా మారింది. ఎందుకంటే.. సోషల్ మీడియాలో అలాంటి వీడియోలకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. అందుకే చాలామంది ఇలాంటి వీడియోలు చేయడానికి ఒక కారణంగా మారింది. సరదా లేదా ఆటపట్టించడానికి సంబంధించిన ఏదైనా వీడియో (Social Media) ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసిన వెంటనే.. అది వెంటనే వైరల్‌గా మారడానికి కారణం ఇదే. వీటిలో కొన్ని అసహ్యకరంగా, సరదాగా ఉంటే.. మరికొన్ని భయానకంగా ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ప్రాంక్ వీడియో చాలా వేగంగా వైరల్ (Viral Video) అవుతోంది. అయితే ఇది చూసిన తర్వాత చాలా మంది యూజర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రాంక్ వీడియోలను బ్యాన్ చేయాలంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది చూస్తుంటే భయానకంగా ఉందని.. ఎందుకు ఇలాంటివి పోస్ట్ చేస్తారంటూ ఆగ్రహిస్తున్నారు. అయితే ఈ ప్రాంక్ వీడియో (Prank Video) లో ఏముంది..? ఎందుకు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.. ఇప్పుడు చూద్దాం..
వైరల్ వీడియోలో.. పార్కింగ్ ఏరియాలో ఒక వ్యక్తి తన పాదాలను చేతిలో పెట్టుకుని నడుస్తుండటాన్ని మీరు చూడవచ్చు. ఇది చూసి అక్కడ ఉన్న ఓ మహిళ కంగారుపడి.. అక్కడి నుంచి పరుగులు తీసింది. దీని తర్వాత ఈ వ్యక్తి మరికొంత మందిని భయపెట్టేందుకు లిఫ్ట్‌లోకి ప్రవేశిస్తాడు. లిఫ్ట్ డోర్ తెరవగానే ఆ వ్యక్తిని చూసి ఇద్దరు యువతులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. దీని తర్వాత ఈ వ్యక్తి తల్లి, కొడుకును భయపెట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇక్కడ పిల్లవాడు మాత్రం భయంతో వణికిపోతాడు.. ఇలాంటి సమయంలో ప్రాణాంతకం కూడా కావొచ్చు. ఇది చూసిన తర్వాత మీరు కూడా ఈ తరహా సరదా సన్నివేశాన్ని అస్సలు ఒప్పుకోరు.
వైరల్ వీడియో..
View this post on Instagram
భయపేట్టేలా చేసిన ఈప్రాంక్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యూటిఫుల్ ఎర్త్ అనే యూజర్ షేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను వేలాది మంది వీక్షించి లైక్ చేస్తున్నారు. దీంతోపాటు నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో భయాందోళనలకు గురిచేస్తోందని.. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరదా కోసం ఇలా చేసేవారిపై కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని సార్లు ఈ వీడియో చూస్తే.. గుండెపోటు వచ్చి ప్రమాదంలో పడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
Also Read: