AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ ఎగ్ రోల్ తింటే మీరు తోపులే.. వామ్మో అంటూ నోరెళ్లబెడుతున్న నెటిజనం.. వీడియో

Biggest Egg Roll: సోషల్ మీడియాలో.. ఫుడ్డీస్ కోసం ఎల్లప్పుడూ పలు ఆహార పదార్థాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇటీవల మిర్చీ హల్వా, ఐస్ క్రీం దోశ పలు రకాల ప్రత్యేక వంటకాలు నెట్టింట వైరల్ అయ్యాయి.

Viral Video: ఈ ఎగ్ రోల్ తింటే మీరు తోపులే.. వామ్మో అంటూ నోరెళ్లబెడుతున్న నెటిజనం.. వీడియో
Egg Roll
Shaik Madar Saheb
|

Updated on: Feb 21, 2022 | 12:34 PM

Share

Biggest Egg Roll: సోషల్ మీడియాలో.. ఫుడ్డీస్ కోసం ఎల్లప్పుడూ పలు ఆహార పదార్థాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇటీవల మిర్చీ హల్వా, ఐస్ క్రీం దోశ పలు రకాల ప్రత్యేక వంటకాలు నెట్టింట వైరల్ అయ్యాయి. అలాంటి వీడియోలను చూసి చాలా మంది నెటిజన్లు ఇదేందిరా..నాయనా అంటూ కామెంట్లు చేశారు. అయితే.. తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇది చూడటానికి అసహ్యకరంగా లేనప్పటికీ.. నెటిజన్లు వామ్మో ఇంత పెద్ద రోలా..? అంటూ నోరెళ్లబెడుతున్నారు. చాలామంది తమకు నచ్చిన ఆహారాన్ని తింటారు. కొంతమంది ఆకలిగా ఉన్నప్పుడు తింటారు.. మరికొంతమంది ఖాళీ సమయాల్లో డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేయడానికి ఇష్టపడతారు. అందుకోసం చాలామంది సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతున్న కొత్త వంటకాల వైపు దృష్టిపెడుతున్నారు. అలాంటి ఫుడ్డీస్ కోసం.. సోషల్ మీడియా (Social Media) లో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు మీరు చాలా రోల్స్‌ ( Roll) ను ట్రై చేసి ఉంటారు. కానీ.. ఇలాంటి ఎగ్ రోల్‌ను మాత్రం అస్సలు ట్రై చేసి ఉండరు. దీని పరిమాణం చూస్తుంటే.. మంచికి బదులు.. చెడు జరిగే అవకాశమే ఎక్కువగా ఉందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

వైరల్ అయిన వీడియోలో.. వీధి వ్యాపారి భారీ తవాపై పిండిని కలుపుతుండటాన్ని మీరు చూడవచ్చు. ఆ తర్వాత రోటీ తవాపై వేసి.. దానిపై ముప్పై గుడ్లను పగులగొట్టి వేస్తాడు. ఇదంతా చేస్తున్నప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నాడో అని ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది పరిమాణంలో భారీగా ఉంటుంది. దాదాపు ముప్పై గుడ్లు వేసి.. దానిపై ఉల్లిపాయ, పనీర్ తిక్కా, ఇతర పదార్థాలను కలిపి భారీ రోల్ చేస్తాడు. ఇది ఖచ్చితంగా రుచిగానే ఉంటుందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ.. ఇంత భారీ రోల్ ఎవరు తింటారనేది నెటిజన్ల నుంచి అనుమానం వ్యక్తం అవుతోంది.

వైరల్ వీడియో..  ఈ వీడియోను యూట్యూబ్ ఛానెల్‌లో ఫిబ్రవరి 16న అప్‌లోడ్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 6.8 మిలియన్లకు పైగా వీక్షించారు. క్యాప్షన్‌లో ఇండియాస్ బిగ్గెస్ట్ రోల్ 30 ఎగ్స్ అని క్యాప్షన్ కూడా రాశారు. అయితే.. ఈ వీడియో చూసి నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

IRCTC: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆ సేవల కోసం ప్రత్యేక యాప్ అందుబాటులోకి తెచ్చిన భారతీయ రైల్వే..

BSNL Plans: తక్కువ ధర.. ఎక్కువ బెనిఫిట్స్‌.. బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే ప్లాన్‌లు..!