Uric Acid Problem: యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి..? దీని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి..?
Uric Acid Health Problem: ఈ రోజుల్లో శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. స్త్రీలు లేదా పురుషులు ఎంతో మంది బాధపడుతున్నారు. ఇది ఒక వ్యర్థ పదార్థం...
Uric Acid Problem: ఈ రోజుల్లో శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. స్త్రీలు లేదా పురుషులు ఎంతో మంది బాధపడుతున్నారు. ఇది ఒక వ్యర్థ పదార్థం. దీని పెరుగుదల కారణంగా శరీరంలో మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. అంటే కిడ్నీపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. మన శరీరంలో యూరిక్ యాసిడ్ (Uric Acid) పెరిగినప్పుడు అది కీళ్లలో, కణజాలాలలో నిక్షిప్తమై దాని వల్ల అనేక ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతే కాదు శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్య (Uric Acid issue) వల్ల హైబీపీ (High BP) సమస్యలు, కీళ్ల నొప్పులు, నడవడంలో ఇబ్బంది, వాపు వంటివి ఏర్పడతాయి. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల మూత్ర విసర్జనలో ఇబ్బంది ఏర్పడుతుంది. అసలు శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడానికి గల కారణాల గురించి తెలుసుకుందాం.
ప్యూరిన్ బఠానీలు, బచ్చలికూర, పుట్టగొడుగులు, బీన్స్, చికెన్ మొదలైన వాటిని తినడం వల్ల శరీరంలో ఏర్పడుతుందని చాలా మంది నమ్ముతుంటారు.ప్యూరిన్ పరిమాణం కూడా పెరిగినప్పుడు శరీరంలో యూరిన్ యాసిడ్ పెరుగుతుంది. దీని కారణంగా యూరిక్ యాసిడ్ మూత్రపిండాల ద్వారా సరిగ్గా ఫిల్టర్ కాదు. దీని కారణంగా శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది. శరీరంలో పెరగడానికి ప్రధాన కారణాలు తెలుసుకుందాం.
1. జన్యు కారణాల వల్ల
2. అనారోగ్యకరమైన ఆహారం కారణంగా
3. అధికంగా మద్యం సేవించడం
4. బయటి ఆహారం తినడం వల్ల
5. డయాబెటిస్ రోగులలో
6. కీమోథెరపీ కారణంగా
7. ఎక్కువసేపు ఆహారం తీసుకోకపోవడం
యూరిక్ యాసిడ్ లక్షణాలు
శరీరంలో యూరిక్ యాసిడ్ లోపం లేదా పెరుగుదల ఉన్నప్పుడు, దాని లక్షణాలు వేర్వేరు వ్యక్తులలో వేర్వేరుగా కనిపిస్తాయి. అంటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి చాలా కాలం పాటు ఎక్కువగా ఉంటే అది చాలా తీవ్రమైన సమస్యగా ఏర్పడుతుంది. దీని వల్ల శరీరంలో కీళ్ల నొప్పులు, కిడ్నీ సమస్యలు మొదలైన అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
1. తీవ్రమైన కీళ్ల నొప్పి, వాపు
2. కీళ్లను తాకినప్పుడు నొప్పి
3. కిడ్నీ సంబంధిత సమస్యలు
4. కిడ్నీ స్టోన్ భయం
5. నడుము మరియు వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి
6. తరచుగా మూత్రవిసర్జన
7. నడవడానికి ఇబ్బంది
8. వేళ్లు వాపు
ఇలా నియంత్రించండి
ఈ సమస్యను నియంత్రించడానికి ఎక్కువగా నీరు తాగాలి. ఇలా ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరంలో ఉన్న చెడు పదార్థాలు బయటకు వెళ్తాయని. ఇలా సమస్యను నియత్రించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాగే శుద్ధి చేసిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండండి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ మొదలైనవి యూరిక్ యాసిడ్‌ను తగ్గించడానికి పని చేస్తాయి. అందుకే వాటిని పుష్కలంగా తినండి. దీనితో పాటు ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవడం మంచిది.
3 టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ ను ఒక గ్లాసు నీళ్లతో కలిపి తీసుకోవడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది . దీంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం లేదా యోగా చేయడం ఎంతో మంచిది.
ఇవి కూడా చదవండి: