Health Tips: మష్రూమ్స్ విపరీతంగా తింటున్నారా.. అయితే, ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే..!
గతంతో పోలిస్తే పుట్టగొడుగులను తినే ట్రెండ్ పెరిగింది. అయితే కొంతమందికి మాత్రం వీటిని తిన్నప్పుడు కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతుంటుంటారు.
Disadvantages Of Eating Mushrooms: గతంతో పోలిస్తే పుట్టగొడుగులను తినే ట్రెండ్ పెరిగింది. నేడు పుట్టగొడుగు(Mushrooms) చాలా మందికి ఇష్టమైన వాటిలో ఒకటిగా మారింది. పుట్టగొడుగులో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, దాని వినియోగం ఆరోగ్య పరంగా ప్రయోజనకరంగా పరిగణించడంలేదు. పుట్టగొడుగులను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి(Health) చాలా హాని కలుగుతుంది. పుట్టగొడుగులు అనేక పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇది ‘విటమిన్ డి’ కి మంచి మూలంగా ఉంది. అయితే మార్కెట్లో చాలా రకాల పుట్టగొడుగులు లభిస్తున్నాయి. వాటిలో దాదాపు 15 హానికరమైనవి ఉన్నాయని మీకు తెలుసా? మరోవైపు, మీరు తప్పుడు రకం ఎంచుకోవడంతోపాటు అవసరమైన దానికంటే ఎక్కువగా పుట్టగొడుగులను తింటే మాత్రం అనేక దుష్ప్రభావాలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో, పుట్టగొడుగులను ఏ వ్యక్తులు తినకూడదు, తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మష్రూమ్ తినడం వల్ల ప్రతికూలతలు-
కడుపు నొప్పి – చాలా మంది ప్రజలు పుట్టగొడుగులను తిన్న తర్వాత అతిసారం, కడుపు నొప్పి, వాంతులు, వికారం వంటి జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు.
స్కిన్ అలెర్జీలు – పుట్టగొడుగులు మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. కానీ, కొందరు వ్యక్తులు వాటిని తీసుకోవడం ద్వారా చర్మంపై దద్దుర్లు, అలెర్జీలు ఎదుర్కోవలసి ఉంటుంది.
నీరసం – పుట్టగొడుగులను తిన్న తర్వాత చాలా మంది అలసిపోతుంటారు. అలాగే కొంచెం అసౌకర్యంగా అనిపించవచ్చు. ఒంట్లో శక్తి స్థాయిలు కూడా తగ్గినట్లు అనిపించవచ్చు. ఇటువంటి పరిస్థితిలో వీటికి కొంచెం దూరంగా ఉండాలి.
గర్భధారణ సమయంలో తినొద్దు – ప్రెగ్నెంట్ సమయంలో మాత్రం పుట్టగొడుగులను తినకూడదు. పిల్లల లేదా తల్లి ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాలు లేనప్పటికీ, మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం పుట్టగొడుగులకు దూరంగా ఉండాలి.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సూచనలుగా మాత్రమే తీసుకోండి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం/చిట్కాలు అనుసరించే ముందు డాక్టర్‌ని సంప్రదించండి.
Also Read: Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఈ పని చేయండి చాలు..
Death in Sleep: ఆ వ్యాధి ఉన్నవారు నిద్రలోనే మరణించే అవకాశం.. ఎందుకంటే..?